VarunLav : రిసెప్షన్‌లో వెంకటేష్‌ని పట్టించుకోని లావణ్య.. వరుణ్‌కి వెంకీ మామ F2 అడ్వైస్..

మెగా రిసెప్షన్ లో వెంకటేష్‌ని పట్టించుకోని లావణ్య. వరుణ్‌కి వెంకీ మామ F2 అడ్వైస్ ఇస్తున్న మీమ్ వీడియో చూశారా?

VarunLav : రిసెప్షన్‌లో వెంకటేష్‌ని పట్టించుకోని లావణ్య.. వరుణ్‌కి వెంకీ మామ F2 అడ్వైస్..

Venkatesh at Varun Tej Lavanya Tripathi Grand Wedding Reception meme video

Updated On : November 6, 2023 / 5:51 PM IST

VarunLav : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ముగిసింది. ఇటలీలోని టస్కనీలో నవంబర్ 1న ఈ వివాహం జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకకు కోసం మెగా, అల్లు కుటుంబసభ్యులు, లావణ్య ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అత్యంత సన్నిహితులు ఈ పెళ్ళికి హాజరయ్యారు. హల్దీ, మెహందీ, సంగీత్.. అంటూ మూడు రోజులు పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకలో మెగా హీరోలంతా కలిసి సందడి చేశారు. ఇక అక్కడే ఫ్యామిలీ రిసెప్షన్ ని కూడా పూర్తి చేసుకొని వచ్చారు. ఇక నిన్న నిన్న ఆదివారం నాడు హైదరాబాద్ లో మరో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

ఈ ఫంక్షన్ కి ఇండస్ట్రీలోని ప్రముఖులు, అభిమానులు హాజరయ్యి కొత్త జంటకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈక్రమంలోనే విక్టరీ వెంకటేష్ కూడా ఈ రిసెప్షన్ కి అటెండ్ అయ్యారు. వెంకటేష్ వచ్చిన సమయంలో లావణ్య పక్కన ఉన్న కుటుంబసభ్యులతో ఏదో సంభాషణలో ఉన్నారు. దీంతో వెంకీ మామ వచ్చిన సంగతి గమనించలేదు. వరుణ్, లావణ్యని పిలిచే ప్రయత్నం చేస్తున్న ఆమె ఆ సంభాషణలో బిజీగా ఉంది. ఇక ఈ మధ్యలో వరుణ్, వెంకీ మధ్య ఒక చిన్న కామెడీ సన్నివేశం కనిపించింది.

Also read : KH234 : కమల్ హాసన్, మణిరత్నం కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది.. గూస్‌బంప్స్ అంతే..

ఇక ఇలాంటి సన్నివేశం కనిపిస్తే మన మీమర్స్ ఊరుకుంటారా. దానిని తప్పకుండా మీమ్ కంటెంట్ గా చేసి వైరల్ చేసేస్తారు. ఆ సీన్ కి F2 మూవీలో వరుణ్ తో వెంకటేష్ చెప్పిన డైలాగ్ ని యాడ్ చేసేశారు. “పెళ్లి అవసరమా అని వెంకీ అంటే, నిను నీ లెక్క కాదు పెళ్ళని కంట్రోల్ చేసేది నాకు మస్తు తెలుసు అనే వరుణ్ సమాధానాన్ని” బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గా వేసేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ తెగ నవ్వుకుంటున్నారు. మరి ఆ ఫన్నీ వీడియోని మీరు కూడా చూసేయండి.