Venky Re Release : థియేటర్స్‌లో ‘వెంకీ’ రీ రిలీజ్ హంగామా.. బ్రహ్మి ఎంట్రీకి రచ్చ రచ్చే.. బ్యానర్స్‌తో బ్రహ్మి అభిమానులు..
వెంకీ రీ రిలీజ్ కి రవితేజ అభిమానులతో పాటు, బ్రహ్మానందం కోసం ప్రేక్షకులు, మీమర్లు అంతా కలిసి థియేటర్స్ లో సందడి చేస్తున్నారు.

Venky Movie Re Release Raviteja Brahmanandam Fans Enjoying in Theaters
Venky Re Release : ఇటీవల ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు, క్లాసిక్ సినిమాలు థియేటర్స్ లో రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు తమ ఫేవరేట్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయితే థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ(Raviteja) హీరోగా తెరకెక్కిన వెంకీ సినిమా నేడు డిసెంబర్ 30న థియేటర్స్ లో రీ రిలీజ్ అయి సందడి చేస్తుంది.
వెంకీ సినిమాలో సీన్స్, కామెడీ, సాంగ్స్ అన్ని ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ అవ్వగా కామెడీ మాత్రం వేరే లెవెల్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ట్రైన్ లో రవితేజ, అతని గ్యాంగ్, బ్రహ్మానందంకు(Brahmanandam) మధ్య జరిగే సీన్స్ వేరే లెవల్. ఆ డైలాగ్స్ అన్ని బట్టీపట్టేసినట్టు చెప్పేస్తాం. ఇప్పటికి ఆ సీన్స్ అన్ని మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. ఇక మీమర్స్ అంతా బ్రహ్మానందాన్ని తమ దేవుడిగా చూస్తారు. ఈ సినిమా నుంచి బ్రహ్మి ఎక్కువ టెంప్లెట్స్ ఉండటంతో ఈ సినిమా మీమర్స్ కి చాలా స్పెషల్.
Also Read : Mahesh Babu : మహేష్ బాబు పర్సనల్ టీంని చూశారా.. బాబు దుబాయ్‌లో అలా ‘కుర్చీ’లో కూర్చొని..
దీంతో వెంకీ రీ రిలీజ్ కి రవితేజ అభిమానులతో పాటు, బ్రహ్మానందం కోసం ప్రేక్షకులు, మీమర్లు అంతా కలిసి థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. ఇక బ్రహ్మి ఎంట్రీకి హీరోల కంటే ఎక్కువగా పేపర్లు ఎగరేసి రచ్చ చేసి హంగామా చేస్తున్నారు. కొంతమంది మీమర్స్ అయితే బ్రహ్మానందంకి బ్యానర్లు కూడా కట్టారు. సినిమాలోని పాటలకు థియేటర్స్ లో స్టెప్పులు వేస్తున్నారు. డైలాగ్స్ అందరూ అరిచి మరీ చెప్తున్నారు. ఇక థియేటర్స్ లో జరిగే ఎంటెర్టైమెంట్ ని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో వెంకీ రీ రిలీజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతైనా రీ రిలీజ్ సినిమాలని కూడా ఈ రేంజ్ లో ఎంజాయ్ చేయడం మన టాలీవుడ్ ప్రేక్షకులకే సాధ్యం.