మిమిక్రీ ఆర్టిస్టుగా ప్రారంభమైన వేణు మాధవ్ కెరీర్
ప్రముఖ హాస్య నటుడు, కథానాయకుడు వేణు మాధవ్.. సినీ జీవిత విశేషాలు..

ప్రముఖ హాస్య నటుడు, కథానాయకుడు వేణు మాధవ్.. సినీ జీవిత విశేషాలు..
ప్రముఖ హాస్య నటుడు, కథానాయకుడు వేణు మాధవ్.. సెప్టెంబర్ 25న అనారోగ్యంతో మరణించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు దగ్గర పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేసిన వేణు మాధవ్.. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘సంప్రదాయం’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. మొదటినుండి మిమిక్రీ పట్ల ఆసక్తి ఉన్న వేణు మాధవ్ కెరీర్ స్టార్టింగ్‌లో కేబుల్ ఛానెల్స్‌లో మిమిక్రీ ప్రోగ్రామ్‌లు కూడా చేశారు.
‘గోకులంలో సీత’, ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘యువరాజు’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా ఎదిగారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్స్ అందరితోనూ నటించారు. ‘వెంకీ’, ‘దిల్’, ‘లక్ష్మీ’, సై, ‘ఛత్రపతి’, ‘జై చిరంజీవ’, ‘పోకిరి’, ‘కృష్ణ’, ‘సింహా’, ‘బృందావనం’, ‘కిక్’, ‘రచ్చ’ వంటి పలు సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు వేణు మాధవ్. ‘నల్లబాలు నల్లతాచు లెక్క’, ‘సనత్ నగర్ సత్తి’, ‘టైగర్ సత్తి’.. ఇలా ఎన్నో క్యారెక్టర్స్‌ని తన స్టైల్ కామెడీతో పండించారాయన.
Read Also : వేణుమాధవ్ టాలెంట్ మొదట గుర్తించింది తెలుగుదేశం పార్టీనే
‘హంగామా’, ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ సినిమాల్లో హీరోగా నటించారు. ప్రేమాభిషేకం చిత్రంతో నిర్మాతగా మారారు. మిమిక్రీ కళాకారుడిగా, బుల్లితెర వాఖ్యాతగా, హాస్యనటుడిగా, హీరోగా,నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమలో పలు విభిన్నమైన పాత్రలు పోషించిన వేణు మాధవ్..
భౌతికంగా మన మధ్య లేకపోయినా తను పోషించిన పలు పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఎల్లప్పుడూ నవ్విస్తూనే ఉంటారు..