Waltair Veerayya: వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వెన్యూ ఫిక్స్.. ఎక్కడంటే?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ నుండి అదిరిపోయే ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్‌ప్యాక్డ్‌గా ఉండటంతో మెగాఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వింటేజ్ చిరంజీవిని చూసి చాలాకాలం అయ్యిందంటూ వారు వాల్తేరు వీరయ్య ట్రైలర్‌ను ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేయడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతగా ఉన్నారు.

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వెన్యూ ఫిక్స్.. ఎక్కడంటే?

Venue Fixed For Waltair Veerayya Pre-Release Event

Updated On : January 7, 2023 / 8:44 PM IST

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ నుండి అదిరిపోయే ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్‌ప్యాక్డ్‌గా ఉండటంతో మెగాఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వింటేజ్ చిరంజీవిని చూసి చాలాకాలం అయ్యిందంటూ వారు వాల్తేరు వీరయ్య ట్రైలర్‌ను ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేయడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతగా ఉన్నారు.

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య ట్రైలర్.. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్!

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ వేడుక విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో, తాజాగా ఈ విషయంపై చిత్ర యూనిట్ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చింది. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ముందుగా ఆర్కే బీచ్‌లో నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, పోలీసులు దానికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో, ఇప్పుడు ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌కు మార్చారు. ఇక ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను అత్యంత భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ శాటిలైట్ రైట్స్‌కు సాలిడ్ రేటు.. ఎవరు సొంతం చేసుకున్నారంటే..?

కాగా, ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా ఎవరు వస్తారా అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ రాజా రవితేజ ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.