ప్రముఖ దర్శకులు సింగీతంకు కోవిడ్ పాజిటివ్..

Singeetam Srinivasa Rao Tests Covid Positive: ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు వీడియో ద్వారా వెల్లడించారు.
https://10tv.in/ankita-lokhande-trolled-after-she-posted-a-picture-on-social-media/
ఈనెల 21న సింగీతం పుట్టినరోజు సందర్భంగా మీడియా వారు ఇంటర్వూలు తీసుకోవడానికి తనకు ఫోన్లు, మెసేజులు చేస్తున్న నేపధ్యంలో తాను కరోనా బారినపడినట్లు స్వయంగా వెల్లడించారు.
ఈ నెల 9న డాక్టర్లు తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.. గత 65ఏళ్ళుగా నేను ‘‘పాజిటివ్’’గానే ఉన్నాను. ఇప్పుడు మీరు పాజిటివ్ అని చెబుతున్నారేంటని వైద్యులతో చమత్కరించాను.. ప్రస్తుతం డాక్టర్ల సూచనలు పాటిస్తూ ఐసొలేషన్‌లో ఉన్నాను, ప్రత్యేకమైన గదిలో గడుపుతుంటే హాస్టల్ రోజులు గుర్తొస్తున్నాయి.. సెప్టెంబర్ 22తో క్వారంటైన్ పూర్తవుతోంది.. తర్వాత ఎప్పటిలానే నాకిష్టమైన పుస్తకాలు చదువుతాను.. నా యోగక్షేమాలు తెలుసుకుంటూ, నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు సింగీతం శ్రీనివాస రావు.
https://www.facebook.com/singeetam.rao/posts/10224281653729296