Saroja Devi : సినీ పరిశ్రమలో విషాదం.. అలనాటి నటి సరోజాదేవి కన్నుమూత
అలనాటి నటి బి.సరోజాదేవి కన్నుమూశారు.

Veteran Actress SarojaDevi Died at 87
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అలనాటి నటి బి.సరోజాదేవి కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. గత కొన్నాళ్లుగా ఆమె వృద్ధాప్య సమస్యలతో బాదపడుతున్నారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం తుది శ్వాస విడిచారు.
1938 జనవరి 7న సరోజాదేవి బెంగళూరులో జన్మించారు. 1955లో ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1957లో ‘పాండు రంగ మహత్యం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
‘ఇంటికి దీపం ఇల్లాలే’, ‘మంచి చెడు’, ‘దాగుడు మూతలు’, ‘పండంటి కాపురం’, ‘దాన వీర శూర కర్ణ’, ‘అల్లుడు దిద్దిన కాపురం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేసింది. తెలుగు, కన్నడ, తమిళ బాషల్లో సుమారు 200కి పైగా సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజ నటులతో కలిసి పని చేశారు.
కళామ్మతల్లికి చేసిన సేవలకు గాను 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. అటు తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డును ఇచ్చింది. 2009లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, నాట్య కళాధర అవార్డులను అందుకున్నారు.