మా కథ మొదలై ఐదేళ్లు..

  • Published By: vamsi ,Published On : February 15, 2020 / 05:30 AM IST
మా కథ మొదలై ఐదేళ్లు..

Updated On : February 15, 2020 / 5:30 AM IST

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్ధ కాలం దాటిపోయినా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో క్రేజీ ప్రాజెక్ట్‌లతో హీరోయిన్ అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్ నయనతార. ఆమె బయటికి చెప్పకపోయినా కూడా నయన్ దర్శకుడు విజ్ఞేశ్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందనే విషయం వాస్తవం. ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు ఫారెన్ టూర్లు చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఈ జంట.

అయితే ఈ ప్రేమ జంట ప్రేమ కథ మొదలై ఐదేళ్లు అయ్యిందట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు నయనతార ప్రియుడు విజ్ఞేశ్ శివన్. వాలంటైన్స్ డే సంధర్భంగా.. వారి మధ్య ప్రేమను వివరిస్తూ.. మా ఇద్దరి కథ మొదలై ఐదేళ్లు అయ్యింది అంటూ వెల్లడించాడు.  నయనతారతో ప్రతి రోజు తనకు వాలెంటైన్స్ డేగా ఉంటుందని అన్న విజ్ఞేశ్ శివన్.. ఎన్నో అనుభూతులు తన ప్రేమతో ముడిపడి ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు విజ్ఞేశ్. 

నయనతార ఇటీవల సైరా సినిమాలో నటించగా.. ప్రస్తుతం తెలుగులో మాత్రం ఏ సినిమాని ఇంకా ఒప్పుకోలేదు. తమిళంలో మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు హీరోయిన్‌గా మంచి అవకాశాలే దక్కించుకుంటుంది.

Read Here>>ఏలియన్లు వస్తున్నాయి!… 16రోజులుగా సంకేతాలు