బిచ్చగాడు హీరో మంచి మనసు.. తన శాలరీలో 25 శాతం తగ్గింపు ప్రకటించాడు..
విజయ్ ఆంటోని మంచి మనసుతో నిర్మాతలకు తనవంతు సాయం..

విజయ్ ఆంటోని మంచి మనసుతో నిర్మాతలకు తనవంతు సాయం..
తమిళ నటుడు విజయ్ ఆంటోని తెలుగులో ‘బిచ్చగాడు’ సినిమాతో నటుడిగా మంచి హిట్‌తో పాటు, పేరు కూడా గడించారు. ఆ తరువాత నుండి వరుసగా మంచి చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్, ప్రస్తుతం మూడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ వలన దాదాపుగా యాభై రోజుల నుండి సినిమా షూటింగ్స్ కూడా నిలుపుదల చేయడంతో తన సినిమాల నిర్మాతలకు వచ్చిన నష్టాన్ని గ్రహించిన విజయ్ ఆంటోని,
మూడు సినిమాలకుగాను తన శాలరీలో 25 శాతం తగ్గించుకుంటున్నట్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాగా తమ హీరో విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ఎంతగానో హర్షించదగినదని, ఈ విధంగానే మిగతా హీరోలు కూడా వారి సినిమాల నిర్మాతల సమస్యలు అర్ధం చేసుకుని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొంత మేర శాలరీ తగ్గించుకుంటే సదరు నిర్మాతలకు కూడా కొంత ఊరటనిచ్చినట్లవుతుందని విజయ్ నటిస్తున్న మూడు సినిమాల్లో ఒక చిత్ర నిర్మాత, అమ్మ క్రియేషన్స్ అధినేత అయిన టి. శివ అభిప్రాయపడ్డారు.
Also Read | లాక్‌డౌన్ వేళ హ్యాట్రిక్ కొట్టిన నితిన్..