Hitler Trailer : ‘హిట్లర్’గా మారిన విజయ్ ఆంటోని.. ట్రైలర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే?
బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ నటుడు విజయ్ ఆంటోని.

Vijay Antony Hitler Trailer out now
బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ నటుడు విజయ్ ఆంటోని. అప్పటి నుంచి ఆయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అవుతున్నాయి. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘హిట్లర్’. ధన దర్శకత్వంతో ఈ సినిమా తెరకెక్కింది. చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ బాషల్లో సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
Kangana Ranaut : పాపం సినిమా కోసం ఆస్తులు అమ్ముకున్న కంగనా రనౌత్..
అందులో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ప్రపంచంలో ‘నిజమైన పవర్ అన్నది డబ్బు, అధికారం కాదు.. ఒక మనిషిని నమ్మి వాడి వెనుక ఉన్న జనమే.’ అనే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. మొత్తంగా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.