Vijay Devarakonda: నాలోని బీస్ట్ బయటకొచ్చేందుకు సిద్ధమైంది.. విజయ్ దేవరకొండ!

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడట. ఈ ఏడాది 'లైగర్'గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రౌడీ ఆశించిన విజయాన్ని అందుకోలేక డీలా పడ్డాడు. మాస్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్ గా కనిపించాడు. ఇక ఈ పాత్ర కోసం ఎన్నో కసరత్తులు చేసి బాడీ బిల్డ్ చేశాడు. అయితే ట్రైనింగ్ టైంలో గాయపడిన విజయ్ గత 8 నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట. తాజాగా నేడు తాను కోలుకున్నట్లు..

Vijay Devarakonda: నాలోని బీస్ట్ బయటకొచ్చేందుకు సిద్ధమైంది.. విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda is ready to show his beast mode

Updated On : November 10, 2022 / 3:40 PM IST

Vijay Devarakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడట. ఈ ఏడాది ‘లైగర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రౌడీ ఆశించిన విజయాన్ని అందుకోలేక డీలా పడ్డాడు. మాస్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్ గా కనిపించాడు. ఇక ఈ పాత్ర కోసం ఎన్నో కసరత్తులు చేసి బాడీ బిల్డ్ చేశాడు.

Vijay Deverakonda: ప్లాప్ వచ్చినా విజయ్ క్రేజ్ మాత్రం తగ్గేదేలే.. భారీ ధరకు అమ్ముడుపోయిన ‘ఖుషి’ మూవీ రైట్స్..

అయితే ట్రైనింగ్ టైంలో గాయపడిన విజయ్ గత 8 నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట. తాజాగా నేడు తాను కోలుకున్నట్లు అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. “ఇన్ని రోజులు ఒక పంజరంలో ఉన్నట్లు ఉంది. ఇప్పుడు నాలోని బీస్ట్ బయటకొచ్చేందుకు సిద్ధమైంది” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పోస్ట్ పెట్టాడు. దీంతో రౌడీ ఫ్యాన్స్ మళ్ళీ విజయ్ లోని ఆ అగ్రసివ్‌నెస్ ని చూడబోతున్నాము అంటూ ఖుష్ అవుతున్నారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక లవ్ అండ్ రొమాంటిక్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ‘ఖుషి’ అని టైటిల్ పెట్టుకున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. డిసెంబర్ లో విడుదల చేద్దామని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, సమంత అనారోగ్యం కారణంగా సినిమా షూటింగ్ నిలిచిపోయింది. గీతాగోవిందం సినిమా తరువాత సరైన హిట్ లేని విజయ్ నుంచి ఫ్యాన్స్ మంచి కమ్ బ్యాక్ ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా అయిన విజయకి హిట్ ఇస్తుంది ఏమో చూడాలి.