Kingdom : ఇది యాక్షన్ సినిమా మాత్రమే కాదు.. సినిమా మొదలైన రెండు నిమిషాలకే ‘కింగ్‌డమ్’ ప్రపంచంలోకి..

తాజాగా కింగ్‌డమ్ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు.

Kingdom : ఇది యాక్షన్ సినిమా మాత్రమే కాదు.. సినిమా మొదలైన రెండు నిమిషాలకే ‘కింగ్‌డమ్’ ప్రపంచంలోకి..

Kingdom

Updated On : July 30, 2025 / 4:40 PM IST

Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా ‘కింగ్డమ్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. రేపు జూలై 31న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సినిమా అవుట్ పుట్ పట్ల మేము చాలా సంతృప్తిగా ఉన్నాము. బుకింగ్స్ కి వస్తున్న అద్భుతమైన స్పందన చూసి మాకు సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న భరోసాతోనే మేము సినిమా విడుదల ముందు ఇంత ప్రశాంతంగా ఉన్నాము. జెర్సీ సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’ ఇది. ఈ సినిమాలో భావోద్వేగాలు కట్టిపడేస్తాయి. చరిత్రలో ఏ యుద్ధం చూసుకున్నా.. కుటుంబం కోసమో, పుట్టిన నేల కోసమో, ప్రేమ కోసమో ఉంటుంది. ఈ యుద్ధం కూడా అలాంటిదే. కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. సినిమా మొదలైన రెండు నిమిషాలకే ప్రేక్షకులు ‘కింగ్‌డమ్’ ప్రపంచంలోకి వెళ్తారు అని తెలిపాడు.

Also Read : Kingdom : ‘కింగ్డమ్’ కథ అదేనా.. విశాల్ సినిమా స్టోరీ.. రామ్ చరణ్ కి చెప్పిన కథ.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ఈమధ్య కాలంలో సినిమాలకు ఓపెనింగ్స్ రాబట్టడం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఆ పరంగా చూస్తే మేము పాస్ అయ్యాము. బుకింగ్స్ బాగున్నాయి. ఓపెనింగ్స్ లోనే 30 శాతం కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. మంచి వసూళ్లతో ఘన విజయం సాధిస్తుంది. ఇది పూర్తిస్థాయి యాక్షన్ సినిమా కాదు. గౌతమ్ తిన్ననూరి ఎమోషన్స్ కూడా ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలతో తెరకెక్కిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. ఈ సినిమా కోసం సెట్స్ వేయలేదు. ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్ లో షూట్ చేశాం ని తెలిపారు.

హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. గతంలో గ్లామర్ రోల్ చేశాను. ఇందులో పక్కింటి అమ్మాయిలా ఉండే పాత్ర చేశాను. కింగ్‌డమ్ లో మధు అనే కీలకమైన పాత్ర పోషించాను. గౌతమ్ గారు నా పాత్రను అద్భుతంగా మలిచారు. ఈ పాత్ర అందర్నీ మెప్పిస్తుంది అని తెలిపింది.

Also Read : Kingdom Press Meet : ‘కింగ్డమ్’ ప్రెస్ మీట్ ఫొటోలు..