Kingdom Collections : నాలుగు రోజుల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ ‘కింగ్‌డ‌మ్’ క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం కింగ్‌డ‌మ్‌.

Kingdom Collections : నాలుగు రోజుల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ ‘కింగ్‌డ‌మ్’ క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా?

Vijay Deverakonda Kingdom four Days Collections

Updated On : August 4, 2025 / 1:57 PM IST

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం కింగ్‌డ‌మ్‌. భాగ్య శ్రీ బోర్సే కథానాయిక న‌టించిన ఈ చిత్రానికి గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జూలై 31న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి మంచి క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి.

తొలి రోజు ఈ చిత్రానికి 39 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. ఇక నాలుగు రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం 82 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని ఓ కొత్త పోస్ట‌ర్ ద్వారా సోష‌ల్ మీడియా వేదిక‌గా చిత్ర బృందం తెలియ‌జేసింది. చిత్రానికి పాజిటివ్ టాక్ రావ‌డంతో అతి త్వ‌ర‌లోనే ఈ మూవీ 100 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్ట‌డం ఖాయ‌మ‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Allu Arjun : పుష్ప సాంగ్ కి అమెరికా ట్యాలెంట్ షోలో అదిరిపోయే పర్ఫార్మెన్స్.. స్పందించిన అల్లు అర్జున్..

ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందించ‌గా.. స‌త్య‌దేవ్, వెంక‌టేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.