Kushi : సమంతకి తెలియకుండా తనతోనే ఇన్‌స్టా రీల్ చేసిన విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!
ఖుషి షూటింగ్ సమయంలో సమంతకి తెలియకుండా విజయ్ దేవరకొండ ఇంకో సినిమా తీసేశాడు. ఆ వీడియోలో ఏముందో మీరు చూసేయండి.

Vijay Deverakonda make insta reel with samantha at Kushi sets
Kushi Movie : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీని శివ నిర్వాణ (Shiva Nirvana) డైరెక్ట్ చేస్తున్నాడు. సమంత అనారోగ్యంతో షూటింగ్ లేటు అవుతూ వచ్చిన ఈ చిత్రం ఇటీవలే మళ్ళీ పట్టాలు ఎక్కి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ ఏదాది సెప్టెంబర్ 1న ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే మూవీ టీం ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఫస్ట్ సింగల్ ని రిలీజ్ చేశారు.
Kushi : ఒక్క సాంగ్‌తోనే రికార్డు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ.. వరల్డ్ టాప్ 5!
మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించిన “నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే” సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ అందుకొని వరల్డ్ బెస్ట్ ఆడియో చార్ట్ బస్టర్స్ లో ఐదవ స్థానాన్నిసొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఇక ఇటీవల షూటింగ్ సెట్స్ లోని ఒక వీడియో రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా విజయ్ దేవరకొండ, సమంతకి తెలియకుండా తనతో చేసిన ఒక ఇన్‌స్టా రీల్ షేర్ చేశారు. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే సాంగ్ లిరిక్స్ తగట్టు విజయ్, సమంతతో ఆ రీల్ ని చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Vijay Deverakonda vs Anasuya : విజయ్ దేవరకొండ విషెస్ చెబుతూ.. హరీష్ శంకర్ అనసూయకు కౌంటర్ ఇచ్చాడా?
ఇక ఈ సినిమా పై విజయ్ అండ్ సమంత ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. విజయ్ నటించిన లైగర్, సమంత నటించిన శాకుంతలం, యశోద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం అవ్వడంతో అభిమానులు నిరాశలో పడ్డారు. దీంతో ఖుషి సినిమాతో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇస్తే చూడాలని ఎదురు చూస్తున్నారు. మరి విజయ్ అండ్ సామ్ ఖుషితో ఎటువంటి రిజల్ట్ ని అందిస్తారో చూడాలి.
View this post on Instagram