Kushi : ఎట్టకేలకు ఖుషీ నుంచి అప్డేట్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్!
విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న ఖుషీ సినిమా నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేశారు.

Vijay Deverakonda Samantha Kushi first song release date
Kushi : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కలిసి నటిస్తున్న సినిమా ‘ఖుషీ’. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. గత ఏడాది ఏప్రిల్ లోనే మొదలైన ఈ మూవీ షూటింగ్ సమంత అనారోగ్యం కారణం లేట్ అవుతూ వచ్చింది. ఇటీవలే సమంత మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెట్టడంతో షూటింగ్ ముందుకు కదిలింది. విజయ్ దేవరకొండ లైగర్ వంటి డిజాస్టర్ తరువాత చేస్తున్న సినిమా కావడంతో రౌడీ ఫ్యాన్స్ అంతా హిట్టు కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు.
Samantha : కొనసాగుతున్న మయోసైటిస్ ట్రీట్మెంట్.. నరకంగా ఉందంటున్న సమంత!
అయితే షూటింగ్ లేట్ అవ్వడంతో అభిమానులంతా నిరాశలో పడ్డారు. ఒక్క అప్డేట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు చిత్ర యూనిట్ మంచి అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. సినిమాలోని ‘నా రోజా నువ్వే’ అనే సాంగ్ ని మే 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ లాంగ్వేజ్స్ లో కూడా ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.
Vijay Devarakonda : సడెన్ గా కొత్త సినిమా ఓపెనింగ్ చేసి ఆశ్చర్యపరిచిన రౌడీ హీరో.. ఈసారి శ్రీలీలతో..
ఇక ఈ అప్డేట్ తో రౌడీ ఫ్యాన్స్ లో ఖుషీ వచ్చింది. లైగర్ తో మిస్ అయిన పాన్ ఇండియా హిట్టని ఖుషీతో విజయ్ అభిమానులకు అందిస్తాడు అంటూ ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. ఇది ఇలా ఉంటే సమంత అభిమానులు కూడా ఈ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల సమంత నటించిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచాయి. దీంతో ఒక్క హిట్టు కోసం సామ్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.
Kushi 1st Song ❤️
May 9th. #NaRojaaNuvve#TuMeriRoja#EnRojaaNeeye#NannaRojaNeene pic.twitter.com/ebAIDgEoBI— Vijay Deverakonda (@TheDeverakonda) May 4, 2023