Leo : లియో ఫస్ట్ లుక్.. తోడేలుతో వచ్చి విజయ్ విశ్వరూపం..

తాజాగా నేడు(జూన్ 22)విజయ్ పుట్టిన రోజూ కావడంతో లియో నుంచి ఫస్ట్ లుక్ ని నిన్న అర్ధరాత్రి 12 గంటలకు రిలీజ్ చేశారు. దీంతో ఈ ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది.

Leo : లియో ఫస్ట్ లుక్.. తోడేలుతో వచ్చి విజయ్ విశ్వరూపం..

Vijay Leo Movie first look released

Updated On : June 22, 2023 / 7:38 AM IST

Vijay :  తమిళ్(Tamil) స్టార్ హీరో విజయ్ వరుస సినిమాలతో, వరుస హిట్స్ తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో లియో(Leo) సినిమా చేస్తున్నాడు. ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నారు. లియో సినిమాలో త్రిష, గౌతమ్ మీనన్, సంజయ్ దత్.. పలువురు స్టార్లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Pawan Kalyan : ప్రభాస్, మహేష్ నా కంటే పెద్ద హీరోలు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ గొడవపడతారని చెప్తారు.. కానీ.. సినిమా హీరోలపై పవన్ వ్యాఖ్యలు

తాజాగా నేడు(జూన్ 22)విజయ్ పుట్టిన రోజూ కావడంతో లియో నుంచి ఫస్ట్ లుక్ ని నిన్న అర్ధరాత్రి 12 గంటలకు రిలీజ్ చేశారు. దీంతో ఈ ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది. ఇక విజయ్ పుట్టిన రోజూ నాడు రిలీజ్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో విజయ్ సుత్తి పట్టుకొని విలన్స్ తో ఫైట్ చేస్తున్నట్టు ఉంది. విజయ్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించారు. ఇక విజయ్ పక్కన తోడేలు కూడా కోపంగా చూస్తూ ఉంది. ఇంత మాస్ గా ఫస్ట్ లుక్ ఉండటంతో లియో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.