విజయ్ సేతుపతి మహారాజ సినిమా.. ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా?

విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబడుతోంది.

విజయ్ సేతుపతి మహారాజ సినిమా.. ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా?

Vijay Sethupathi Maharaja box office day 1 collection details here

Maharaja box office day 1 collection: విలక్షణ నటుడు విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజ శుక్రవారం (జూన్ 14) థియేటర్లలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 1915 స్క్రీన్లలో ఈ మూవీ రిలీజయింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబడుతోంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ రూ. 10 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్టు సాక్నిల్క్ ట్రేడ్ రిపోర్ట్ వెల్లడించింది. మొదటి రోజు ప్రీ రిలీజ్ సేల్స్‌తో దాదాపు 4 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

మహారాజకు పాజిటివ్ రివ్యూలు రావడంతో పాటు.. ఫ్యామిలీతో థియేటర్‌లో చూడదగ్గ మూవీ అని సినిమా చూసిన వారు చెబుతుండడం ప్లస్ పాయింట్‌గా మారింది. దీంతో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. సరికొత్త స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ థ్రిల్ చేసేలా తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి నటన హైలైట్ అని చెబుతున్నారు. క్వాలిటీ అవుట్‌ఫుట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా వీకెండ్‌లో మంచి వసూళ్లు రాబడుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

Also Read: ‘మహారాజ’ మూవీ రివ్యూ.. విజయ్ సేతుపతి 50వ సినిమా ఎలా ఉందంటే..

ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్‌పై సుదన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించిన ఈ సినిమాను నితిలన్ సామినాథన్ డైరెక్ట్ చేశారు. తెలుగులో ఎన్‌వీఆర్ సినిమా దీన్ని విడుదల చేసింది. అనురాగ్ కశ్యప్, నట్టి, భారతీరాజా, అభిరామి, మమతా మోహ‌న్‌దాస్‌, సింగం పులి, అరుల్‌దాస్, మునీశ్‌కాంత్‌ ఇతర పాత్రల్లో కనిపించారు.

Also Read: ‘హరోం హర’ మూవీ రివ్యూ.. సుధీర్ బాబు హిట్ కొట్టాడా?