Vijay Sethupathi : విజయ్ సేతుపతి ఏస్ సినిమా.. డార్క్ కామెడీతో.. ఒకేసారి తమిళ్ – తెలుగులో..
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా విజయ్ సేతుపతితో పాటు మూవీ టీమ్ కూడా హాజరైంది.

Vijay Sethupathi Dark Comedy Ace Movie Releasing
Vijay Sethupathi : విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ జంటగా దివ్య పిళ్ళై, బబ్లూ పృథ్వీరాజ్, రుక్మిణి మైత్ర, యోగిబాబు.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఏస్’. 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అరుముగ కుమార్ దర్శక నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రేపు మే 23న తెలుగు – తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. విజయ్ సేతుపతి ఏస్ సినిమాని తెలుగులో శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ పై బి.శివ ప్రసాద్ రిలీజ్ చేయబోతున్నారు.
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా విజయ్ సేతుపతితో పాటు మూవీ టీమ్ కూడా హాజరైంది. ఈ ఈవెంట్లో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ‘అరుముగ కుమార్ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. నాకు సినిమాలో మొదటి చాన్స్ ఇచ్చింది ఆయనే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయనతో పని చేస్తున్నాను. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసే శివ ప్రసాద్ కు ఆల్ ది బెస్ట్ నాయి తెలిపారు.
Also See : Varun Sandesh – Vithika Sheru : భార్యతో అరుణాచలంలో వరుణ్ సందేశ్.. ఫొటోలు చూసారా?
నిర్మాత బి. శివ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఏస్’ సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టు కనిపిస్తోంది. ఈ కథ, కారెక్టర్స్ అన్నీ అద్భుతంగా ఉండబోతున్నాయి. విజయ్ సేతుపతి గారు మళ్లీ అందరినీ ఆకట్టుకోబోతున్నారు. త్వరలోనే ఆయనతో రొమాంటిక్ డాన్ అనే సినిమాను ప్రకటిస్తాను అని అన్నారు. దర్శక,నిర్మాత అరుముగ కుమార్ మాట్లాడుతూ.. ఏస్ సినిమాలో యాక్షన్, రొమాన్స్, ఫన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. విజయ్ సేతుపతి గారు ఆల్ రౌండర్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అని అన్నారు.
నటుడు బబ్లూ పృథ్వీ మాట్లాడుతూ.. ప్రస్తుతం వరుసగా ప్రాజెక్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాను. కార్డ్‌లో ఏస్ అంటే ఒకటి.. అన్నింటి కంటే హయ్యస్ట్ కార్డ్. అరుముగ గారి మైండ్‌లో మొత్తం స్క్రిప్ట్ ఉంటుంది. విజయ్ సేతుపతి గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఇది డార్క్ కామెడీ సినిమా అని తెలిపారు.