Vijay Varma : తమన్నాతో డేటింగ్‌లో ఉన్నట్లు కన్ఫామ్ చేసిన విజయ్ వర్మ
తమన్నా, విజయ్ వర్మ.. ఇద్దరి మధ్యా ఏదో ఉందంటూ జరిగిన ప్రచారానికి తెరపడింది. తాము ఇద్దరం డేటింగ్‌లో ఉన్నామంటూ ముందుగా తమన్నా.. తరువాత విజయ్ వర్మ కన్ఫామ్ చేశారు. ఇన్నాళ్లు సందిగ్ధంలో ఉన్న అభిమానులకు కాస్త రిలీఫ్ ఇచ్చారు.

Vijay Varma
Vijay Varma : లస్ట్ స్టోరీస్ 2 తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న తమన్నా, విజయ్ వర్మల మధ్య ఏదో నడుస్తోందంటూ ఆ మధ్య పుకార్లు గుప్పుమన్నాయి. కొత్త సంవత్సరం వేడుకల్లో మరీ సన్నిహితంగా కనిపించడం.. అప్పుడప్పుడు లంచ్, డిన్నర్లకు కలిసి బయటకు వెళ్లడం చూసి వీరి మధ్య రిలేషన్ ఉందని అభిమానులు ఊహించారు. చివరకు రీసెంట్ గా తమన్నా విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నది నిజమేనంటూ ధృవీకరించడంతో పుకార్లకు తెరపడింది. ఇక విజయ్ వర్మ కూడా తమ మధ్య ఉన్న బంధాన్ని ఒప్పుకున్నాడు.
Tamannaah : పెళ్లంటే పార్టీ కాదు.. బాధ్యత అంటున్న తమన్నా
స్క్రీన్ మీద కొంచెం డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ వస్తున్న విజయ్ వర్మ తమన్నాతో లస్ట్ స్టోరీస్ 2 లో నటిస్తున్నాడు. రీసెంట్‌గా తమన్నాతో డేటింగ్ గురించి మీడియా ప్రస్తావించడంతో ప్రస్తుతం తను ‘హ్యాపీ స్పేస్’ లో ఉన్నానని తను ప్రేమలో ఉన్నానని చెప్పాడు. ప్రస్తుతానికి ప్రేమ ఉందని మాత్రం చెప్పగలను.. సరైన సమయం వచ్చినప్పుడు పూర్తి వివరాలు మాట్లాడతానని చెప్పాడు.
Tamannaah : నా తమన్నాతో తిరుగుతున్నావు.. భలే బుద్ధి చెప్పావు.. విజయ్ వర్మ ఫ్రెండ్ వైరల్ కామెంట్స్!
ఇక తను హైదరాబాద్ నుంచి ముంబయి వస్తే.. తమన్నా ముంబయి నుంచి హైదరాబాద్ వెళ్లిందని.. ఇలా వృత్తి పరంగా తమ ప్రయాణం సాగుతోందని విజయ్ వర్మ చెప్పుకొచ్చాడు. పెళ్లెప్పుడు? అనే ప్రశ్నకు ఇప్పటిలో సమాధానం దొరకకపోవచ్చునేమో కానీ ఇన్ని రోజులుగా వీరి మధ్య ఏదో ఉందంటూ జరిగిన ఊహాగానాలకు మాత్రం తెరపడినట్లే.