Cobra Movie: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విక్రమ్ ‘కోబ్రా’!
తమిళ వర్సెటైల్ హీరో చియాన్ విక్రమ్ సినిమా వస్తుందంటే, తమిళనాటే కాకుండా తెలుగులో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అలాంటి విక్రమ్ నటించిన ‘కోబ్రా’ మూవీ రీసెంట్‌గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

Vikram Cobra Movie Locks OTT Streaming Date
Cobra Movie: తమిళ వర్సెటైల్ హీరో చియాన్ విక్రమ్ సినిమా వస్తుందంటే, తమిళనాటే కాకుండా తెలుగులో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అలాంటి విక్రమ్ నటించిన ‘కోబ్రా’ మూవీ రీసెంట్‌గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించగా, ఈ సినిమాలో విక్రమ్ పలు రకాల గెటప్స్‌లో కనిపించి ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేశాడు.
Cobra Movie: ఓటీటీలో ఎంట్రీకి రెడీ అయిన కోబ్రా.. ఎప్పుడంటే?
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించకపోవడంతో, ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సోని లివ్ దక్కించుకోగా, ఈ మూవీని సెప్టెంబర్ 28న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
Cobra Movie: చియాన్ విక్రమ్ ‘కోబ్రా’కు కోతపెట్టిన చిత్ర యూనిట్!
ఇక ఈ సినిమాలో విక్రమ్ సరసన అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ సినిమాతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందించారు. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.
“தீராதி தீரா, துப்பாக்கி மாந்தீரா” கோப்ரா. விரைவில் Sony LIV-ல்
Available in Tamil | Telugu | Malayalam | Kannada #Cobra #SonyLIV #CobraonSonyLIV #Catchhimifyoucan. @chiyaan @7screenstudio @AjayGnanamuthu @arrahman @RedGiantMovies pic.twitter.com/t7HNxuFUHb— SonyLIV (@SonyLIV) September 25, 2022