Cobra Movie: ఓటీటీలో ఎంట్రీకి రెడీ అయిన కోబ్రా.. ఎప్పుడంటే?

తమిళ విలక్షణ హీరో చియాన్ విక్రమ్ నటించిన రీసెంట్ మూవీ ‘కోబ్రా’ రిలీజ్‌కు ముందర ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాలో విక్రమ్ విభిన్న గెటప్స్‌లో కనిపించడంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఇక పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఆగస్టు 31న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది.

Cobra Movie: ఓటీటీలో ఎంట్రీకి రెడీ అయిన కోబ్రా.. ఎప్పుడంటే?

Cobra Movie OTT Streaming From This Date

Cobra Movie: తమిళ విలక్షణ హీరో చియాన్ విక్రమ్ నటించిన రీసెంట్ మూవీ ‘కోబ్రా’ రిలీజ్‌కు ముందర ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాలో విక్రమ్ విభిన్న గెటప్స్‌లో కనిపించడంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఇక పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఆగస్టు 31న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది.

Cobra Movie: చియాన్ విక్రమ్ ‘కోబ్రా’కు కోతపెట్టిన చిత్ర యూనిట్!

అయితే ఈ సినిమాలో కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇక ఈ సినిమాను దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే థియేటర్ల నుండి మాయమైంది. ఇప్పుడు ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే థియేటర్లలో కాకుండా ఈసారి ఓటీటీలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Cobra Movie: మళ్లీ వెనక్కి వెళ్లిన కోబ్రా.. ఎప్పుడొస్తున్నాడంటే..?

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీ లివ్ కోబ్రా చిత్ర డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకోవడంతో, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధం చేసింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23 లేదా 31న ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు సోనీ లివ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ రోజున ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరి థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయిన కోబ్రా, ఓటీటీలో ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.