82 వయసులోనూ అదరగొడుతున్న విశాల్ తండ్రి జీకే రెడ్డి..

Vishal’s Father GK Reddy Fitness: టీనేజ్‌లో ఉన్నప్పుడు కండలు తిరిగిన బాడీ ఉన్నా.. వయసు మళ్లిన తర్వాత వడలిపోవడం అనే ప్రక్రియ సాధారణంగా జరుగుతుంది. అయితే హీరో విశాల్ తండ్రి, ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త జీకే రెడ్డి మాత్రం 82 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్‌నెస్‌తో అబ్బురపరుస్తున్నారు. తనయుడు విశాల్‌తో పోటీపడుతూ కండలు పెంచుతున్నారు. ఈ వయసులో ఆయన ఫిట్‌నెస్ లెవెల్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
జీకే రెడ్డి, విశాల్ ఇటీవల కరోనా బారిన పడ్డారు. ముందు నుంచి వ్యాయామం చేసే అలవాటున్న జీకే రెడ్డి త్వరగానే కోలుకున్నారు. కోలుకున్న తర్వాత వ్యాయామంపై మరింత దృష్టి సారించారు. ఇంట్లోనే ఉంటూ కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.
జీకే రెడ్డిని చూసి యూత్ ఫిట్‌నెస్ మీద మరింత శ్రద్ధ పెట్టాలంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.