Vishwak Sen : సూపర్ హిట్ కాంబినేషన్‌తో వస్తున్న విశ్వక్.. తనలోని బ్యాడ్‌ని పరిచయం చేస్తాడట!

విశ్వక్ సేన్ (Vishwak Sen) తన 11వ సినిమాని టాలీవుడ్ హిట్ కాంబినేషన్ తో సెట్ చేశాడు. దీంతో ఈసారి తనలోని బ్యాడ్ మ్యాన్ ని పరిచయం చేస్తాను అంటున్నాడు.

Vishwak Sen : సూపర్ హిట్ కాంబినేషన్‌తో వస్తున్న విశ్వక్.. తనలోని బ్యాడ్‌ని పరిచయం చేస్తాడట!

Vishwak Sen 11th movie announce Yuvan Shankar Raja music

Updated On : March 29, 2023 / 5:32 PM IST

Vishwak Sen : సూపర్ హిట్ కాంబినేషన్ మళ్ళీ ఒక ప్రాజెక్ట్ తో రాబోతుంది. కాంబినేషన్ అంటే హీరో, హీరోయిన్, దర్శకులు కాదండోయ్ ముగ్గురు నిర్మాతల కలయిక. ఈ ఏడాది సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కలిసి నిర్మించిన చిత్రం ‘సార్’. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ఈ సినిమా బై లింగువల్ గా తెరకెక్కింది. ఫిబ్రవరి 17న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు ధనుష్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. దాదాపు 118 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

ViswakSen : ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా చేస్తా

ఇప్పుడు ఈ మూడు నిర్మాణ సంస్థలు మరోసారి కలిసి ఒక కొత్త సబ్జెట్ తో రాబోతున్నారు. నిన్న (మార్చి 28) ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా నేడు ఈ సినిమాలో నటించే హీరో మరియు చిత్ర యూనిట్ ని అనౌన్స్ చేస్తూ ఒక వీడియో గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. విశ్వక్ సేన్ (Vishwak Sen) ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. త్రివిక్రమ్ శిష్యుడు, చల్ మోహన్ రంగ సినిమా తెరకెక్కించిన కృష్ణ చైతన్య (Krishna Chaitanya) ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు.

Das Ka Dhamki : దాస్ కా ధమ్కీ.. పాత కథ, అన్ని తెలిసిన ట్విస్టులే.. కానీ సరికొత్త స్క్రీన్ ప్లేతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్..

గ్లింప్స్ చూస్తుంటే రాజమండ్రి బ్యాక్‌డ్రాప్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక కథ వచ్చి ఇసుక మాఫియా చుట్టూ తీరబోతుందని అర్ధమవుతుంది. ఇక విశ్వక్ సేన్ వచ్చి ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ గ్లింప్స్ తో తెలియజేశారు. చిన్న కాన్సెప్ట్ విడియోతోనే సినిమా ఎలా ఉండబోతుందో అని ఒక ఉదాహరణ ఇచ్చేశారు. మరి సార్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ ఈ సినిమాతో ఎటువంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.