Das Ka Dhamki : ధమ్కీ-2కి విశ్వక్ సేన్ హింట్ ఇచ్చాడా?

విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన 'దాస్ కా ధమ్కీ' (Das Ka Dhamki) ఉగాది కానుకగా నేడు (మార్చి 22) ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమా ఎండింగ్ లో..

Das Ka Dhamki : ధమ్కీ-2కి విశ్వక్ సేన్ హింట్ ఇచ్చాడా?

Das Ka Dhamki

Updated On : March 22, 2023 / 3:03 PM IST

Das Ka Dhamki : విశ్వక్ సేన్ (Vishwak Sen) మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతూ చేస్తున్న సినిమా ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). ఉగాది కానుకగా నేడు (మార్చి 22) ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నివేత పేతురేజ్ (Nivetha Pethuraj) హీరోయిన్ గా నటిస్తుంది. గతం వీరిద్దరూ ‘పాగల్’ సినిమాలో కలిసి నటించి హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ధమాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి కథని అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథని అందించాడు. ఇక విశ్వక్ సేన్ ఈ సినిమా దర్శకుడి బాధ్యతలు కూడా తీసుకోని ఈ మూవీని డైరెక్ట్ చేశాడు.

Das Ka Dhamki : దాస్ కా ధమ్కీ సినిమాకు వెళ్తే ధమాకా సినిమా వేశారు.. వైరల్ అవుతున్న వీడియో..

ఈ సినిమాలో విశ్వక్ మొదటిసారి డ్యూయల్ రోల్ లో నటించాడు. కృష్ణదాస్ అండ్ సంజయ్ రుద్రా అనే రెండు పాత్రల్లో కనిపించాడు. సంజయ్ రుద్రా అనే వాడు ఒక ఫేమస్ డాక్టర్. కాన్సర్ వ్యాధి లేని ప్రపంచం చూడాలని, దాని కోసం మందు కనిపెట్టే ప్రయత్నంలో ఉంటాడు. అయితే ఇంతలో కారు ఆక్సిడెంట్ లో సంజయ్ చనిపోతాడు. అక్కడి నుంచి కృష్ణదాస్, సంజయ్ కుటుంబంలోకి వస్తాడు. సంజయ్ మరణం వెనుక ఉన్న అసలు కథ ఏంటో కృష్ణదాస్ తెలుసుకోవడమే మిగిలిన కథ. కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది.

కాగా ఈ సినిమా ఎండింగ్ లో విశ్వక్ సేన్ సీక్వెల్ కి హింట్ ఇచ్చాడు. ధమ్కీ-2 అంటూ ఎండ్ కార్డ్స్ లో వేశాడు. మరి నిజంగానే ధమ్కీ సీక్వెల్ ఉంటుందా? లేదా? అంటే ఎదురు చూడాల్సిందే. ఈ చిత్రానికి నిర్మాతగా కూడా విశ్వక్ సేన్ వ్యవహరించాడు. కరాటే రాజ్ తో కలిసి విశ్వక్ దాదాపు 30 కోట్లతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించాడు. రావు రమేష్, అజయ్, తరుణ భాస్కర్, హైపర్ ఆది, అక్షర గౌడ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, రామ్ మిరియాల ఒక పాటకి మ్యూజిక్ ఇచ్చాడు.