Das Ka Dhamki : హమ్మయ్య.. ధమ్కీ షూట్ అయింది.. వాయిదాల మీద వాయిదాలు.. విశ్వక్ ఎప్పుడు రిలీజ్ చేస్తాడో..

మొత్తానికి దాస్ కా ధమ్కీ షూటింగ్ పూర్తయినట్టు అధికారికంగా ప్రకటించి ఓ మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దీంతో విశ్వక్ అభిమానులు త్వరగా పోస్టు ప్రొడక్షన్ పూర్తి చేసి సినిమా రిలీజ్ చేయాలని.............

Das Ka Dhamki : హమ్మయ్య.. ధమ్కీ షూట్ అయింది.. వాయిదాల మీద వాయిదాలు.. విశ్వక్ ఎప్పుడు రిలీజ్ చేస్తాడో..

Vishwaksen Das Ka Dhamki movie shoot wrapped post production works going on

Updated On : February 25, 2023 / 9:54 AM IST

Das Ka Dhamki :  యువ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఇటీవల ఓరి దేవుడా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి పర్వాలేదనిపించాడు. త్వరలో దాస్ కా ధమ్కీ సినిమాతో రాబోతున్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటికే పలు సార్లు వాయిదా పడింది. ఇప్పటికే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసినా మళ్ళీ మళ్ళీ వాయిదా వేస్తూ వచ్చారు ఈ సినిమాని. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించడమే కాదు ఈ సినిమాకి డైరెక్టర్, నిర్మాత కూడా. దీంతో ఈ సినిమాపై విశ్వక్ సేన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయి సినిమాపై మంచి హైప్ ని పెంచాయి. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ ఇంకా అవ్వలేదు, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ చెప్తాము అని ప్రకటించారు చిత్రయూనిట్. ఇప్పుడేమో తాజాగా దాస్ కా ధమ్కీ షూటింగ్ పూర్తయింది అని పోస్ట్ చేశారు. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు షూటింగ్ పూర్తి అవ్వకుండానే సినిమాని ప్రమోట్ చేస్తున్నారు, రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారని భావిస్తున్నారు.

Nani-Keerthy Suresh : మహానటితో కలిసి నాని దసరా సెట్ లో ఏం చేస్తున్నాడో చూడండి..

మొత్తానికి దాస్ కా ధమ్కీ షూటింగ్ పూర్తయినట్టు అధికారికంగా ప్రకటించి ఓ మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దీంతో విశ్వక్ అభిమానులు త్వరగా పోస్టు ప్రొడక్షన్ పూర్తి చేసి సినిమా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు. ఈ సినిమాలో నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇందులో విశ్వక్ రెండు పాత్రలు పోషించనున్నట్టు తెలుస్తుంది. దాస్ కా ధమ్కీ సినిమా మార్చ్ లేదా ఏప్రిల్ లో రిలీజ్ చేయొచ్చని సమాచారం. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.