35 Chinna Katha Kaadu : మంచి సినిమా.. పిల్లలతో కలిసి చూడండి.. అస్సలు మిస్ అవ్వొద్దు..
పిల్లల చదువు గురించి ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తీర్చిదిద్దారు.

Watch this Good Family Emotional Entertainer 35 Chinna Katha Kaadu Movie in OTT
35 Chinna Katha Kaadu : నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ’35 చిన్న కథ కాదు’. రానా సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మాణంలో నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా సెప్టెంబర్ 6న థియేటర్స్ లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
పిల్లల చదువు గురించి ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తీర్చిదిద్దారు. కచ్చితంగా పిల్లలతో కలిసి చూసే సినిమా ఇది. ఫ్యామిలీ అంతా కూర్చొని ఆహా ఓటీటీలో ఈ సినిమాని చూసేయండి.
Akso Read : Dhee Sequel : ‘ఢీ’ సీక్వెల్ అందుకే ఆగిపోయింది.. శ్రీను వైట్ల వ్యాఖ్యలు..
’35 చిన్న కథ కాదు’ సినిమా కథ విషయానికొస్తే.. తిరుపతిలో నివసించే ప్రసాద్(విశ్వదేవ్) TTD బస్సులో కండక్టర్. అతని భార్య సరస్వతి(నివేదా థామస్)ఇల్లాలిగా ఉంటుంది. పిల్లలు అరుణ్, వరుణ్. అరుణ్ కి చిన్నప్పట్నుంచి లెక్కల్లో బోలెడు డౌట్స్ ఉంటాయి. అతని డౌట్స్ ఎవరూ తీర్చకపోవడంతో లెక్కలు అంటేనే నచ్చవు. ఎలాగోలా ఐదోతరగతి దాకా చదివాకా వేరే స్కూల్ లో ఆరో తరగతిలో జాయిన్ అవుతాడు. అక్కడ మ్యాథ్స్ టీచర్ చాణక్య వర్మ(ప్రియదర్శి) పిల్లలని మార్కుల బట్టి ట్రీట్ చేస్తూ ఉంటాడు. అరుణ్ కి సున్నా అని తెలియడం, మ్యాథ్స్ లో ఎక్కడలేని డౌట్స్ అరుణ్ అడుగుతుండటంతో చాణక్యవర్మ అతనిపై కోపం పెంచుకొని అతన్ని ఒక క్లాస్ తక్కువ చేసి మళ్ళీ ఐదో తరగతికి వేస్తాడు. అనుకోకుండా అరుణ్ చాణక్య వర్మ యాక్సిడెంట్ కి కారణం అవ్వడంతో స్కూల్ లో పెద్ద గొడవ అయి అరుణ్ ని సస్పెండ్ చేస్తారు. అరుణ్ స్కూల్ లో కొనసాగాలంటే మ్యాథ్స్ లో పాస్ అవ్వాలి అనే కండిషన్ చాణక్య వర్మ పెడతాడు. ఈ విషయంలో ప్రసాద్ తో సరస్వతికి కూడా గొడవయి తన కొడుకు మ్యాథ్స్ ని పట్టుదలగా తీసుకుంటుంది. దీంతో అరుణ్ మళ్ళీ స్కూల్ కి వచ్చాడా? మ్యాథ్స్ లో పాస్ అయ్యాడా? టెన్త్ ఫెయిల్ అయిన సరస్వతి కొడుకు మ్యాథ్స్ కోసం ఏం చేసింది? సరస్వతి భర్తతో ఎందుకు గొడవపెడుతుంది? తెలియాలంటే ఆహాలో సినిమా చూసేయండి.