RRR: తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు.. ఎక్కడ.. అసలు ఉంటుందా?
రోజులు చకా చకా గడిచిపోయాయి.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల చేసినపుడు సినిమా కోసం ఇంకా పది రోజులు ఆగాలా.. అని ప్రేక్షకులు ఉత్కంఠతో చూశారు.ఇప్పుడు నెల రోజులు కాస్త పది రోజులకు వచ్చేసింది.
RRR: రోజులు చకా చకా గడిచిపోయాయి.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల చేసినపుడు సినిమా కోసం ఇంకా పది రోజులు ఆగాలా.. అని ప్రేక్షకులు ఉత్కంఠతో చూశారు. ఇప్పుడు నెల రోజులు కాస్త పది రోజులకు వచ్చేసింది. కరెక్ట్ గా మరో తొమ్మిది రోజులలో థియేటర్లలో ఆర్ఆర్ఆర్ మోత మోగిపోనుంది. ఒమిక్రాన్ లాంటి భయాలున్నా.. మహారాష్ట్ర, ఢిల్లీ ఆంక్షలు అనుమానాలు పెంచినా సినిమా మాత్రం ఆగేది.. ఆపేది లేదని రాజమౌళి అభయహస్తం ఇచ్చేశాడు. దీంతో ఆర్ఆర్ఆర్ కోసం ఎదురుచూసే వారికి నమ్మకం వచ్చేసింది.
RRR: నెవెర్ బిఫోర్ అనేలా తారక్-చరణ్.. ఓ తప్పస్సులా ప్రమోషన్లు!
మరోవైపు అమెరికాలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రీరిలీజ్ బుకింగ్స్ కూడా జరిగిపోతుంటే.. ఇండియాలో ఆర్ఆర్ఆర్ యూనిట్ నగరాలను చుట్టేస్తూ సినిమాను ఇంకా ఇంకా పెంచే పనిలో ఉంది. ముంబైలో మొదలు పెట్టిన ప్రచారం.. తాజాగా చెన్నైలో హడావుడి చేసింది. ఎక్కడిక్కడ ప్రతి ప్రీ రిలీజ్ వేడుక ఓ రేంజ్ లో హైలెట్ అయింది. హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ టాక్ పీక్స్ లోకి చేరింది. ఇక, ఇప్పుడు తెలుగు భాషకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడు అనేది ఆసక్తి కరంగా మారింది.
RRR: తారక్, చెర్రీ అన్నదమ్ముల బంధం.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
సినిమా విడుదలకు మరో తొమ్మిది రోజులే సమయం ఉంది. అందులో ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ సంబరాలకు రెండు రోజులు పోతుంది. మిగిలింది మరో వారం మాత్రమే. అయితే ఇప్పటి వరకు ఈ వేడుక ఎక్కడ జరగనుంది.. ఎప్పుడు చేయాలి అనేది ఎక్కడా లీకులు కూడా లేవు. ఈ వేడుకకు సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ హాజరుకానున్నారని ఓ టాక్ అయితే నడించింది. కానీ.. అసలు ఈ వేడుక ఎప్పుడన్నది మాత్రం ఎవరికి క్లారిటీ లేదు. దీంతో అసలు తెలుగులో ఈ వేడుక ఉంటుందా.. ఉండదా.. ఉంటే మేకర్స్ క్లారిటీ ఇవ్వాలని సోషల్ మీడియాలో భారీ ఎత్తున రిక్వెస్టులు కనిపిస్తున్నాయి.