Bigg Boss OTT Telugu: నాగ్ బుగ్గపై ఈ పెదవుల ముద్ర ఎవరిదబ్బా?
నో కామా.. నో ఫుల్‌స్టాప్.. బిగ్‌బాస్ అయింది ఇక నాన్‌స్టాప్. ఓటీటీ జమానాలో ఇక 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు రెడీ అయ్యింది.

Bigg Boss Ott Telugu (1)(1)
Bigg Boss OTT Telugu: నో కామా.. నో ఫుల్‌స్టాప్.. బిగ్‌బాస్ అయింది ఇక నాన్‌స్టాప్. ఓటీటీ జమానాలో ఇక 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు రెడీ అయ్యింది. ఫిబ్రవరి 26 అంటే ఈ రోజు శనివారం నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో ఈ షో ప్రసారం మొదలైంది. దీనికి సంబంధించి ప్రోమో విడుదలవగా నాగార్జునే ఈ బిగ్ బాస్ ఓటీటీకి హోస్టింగ్ చేయబోతున్నారని క్లారిటీ వచ్చేసింది.
Bigg Boss OTT Telugu: రెడ్‌లైట్ ఏరియాకన్నా డేంజర్.. బిగ్‌బాస్‌పై నారాయణ ఫైర్!
సాయంత్రం 6 గంటల నుంచి నుంచి ఎంతో గ్రాండ్‌గా ప్రారంభించినట్లు ప్రకటించగా.. ఇది మొత్తం 85 రోజుల పాటు సాగనుందని తెలుస్తోంది. ఇక, ఇందులో 18 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతుండగా తాజాగా విడుదలైన ప్రోమోలో కొందరిని కనిపించే కనిపించినట్లుగా చూపించారు. ఇక ఈ ప్రోమో ఓ ఆసక్తికర సన్నివేశం కూడా బిగ్ బాస్ నిర్వాహకులు హైలెట్ చేశారు. అదేమిటంటే ఎవరో హోస్ట్ నాగార్జున బుగ్గపై ముద్దు పెట్టారు. అది దాదాపు కంటెస్టెంట్ అనేది అర్ధమవుతుంది.
Bigg Boss OTT Telugu: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ప్రోమో రిలీజ్
ముందుగా ఈ ఇల్లును చూసుకోవడానికి ఓ మగాడు కావాలి అంటూ `భీమ్లానాయక్`లో సముద్ర ఖని చెప్పిన డైలాగ్ తో మొదలయ్యే ప్రోమోలో నాగార్జున ఎంట్రీ అదిరింది. అమ్మాయిలంతా వెళ్లి వెల్కమ్ చెప్పడం.. నాగ్ స్టైలిష్ లుక్ తో ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ నుండి బిగ్ బాస్ హౌస్ రెయిన్ బో లా కలర్ ఫుల్ గా వుంది. హోస్టింగ్ ఇక్కడి నుంచే చేస్తే బాగటుందనిపిస్తుందని నాగార్జున అనగానే.. బిగ్ బాస్.. నాగార్జున ఇది నా అడ్డా.. అనడంతో నాగ్ హౌస్ వదిలి స్టేజ్ మీదకి వచ్చేశాడు.
Bigg Boss OTT Telugu: నాన్‌స్టాప్ బిగ్‌బాస్ రేపటి నుంచే.. ప్రోమో అదరగొట్టిన నాగ్!
ఇక స్టేజ్ పై కంటెస్టెంట్ లని పరిచయం చేసే ప్రక్రియని స్టార్ట్ చేయడం.. కంటెస్టెంట్ లు నాగ్ అడిగిన ప్రశ్నలకు అమ్మ బాబోయ్ అంటూ అరవడం.. ప్రోమోకి `భీమ్లానాయక్` బ్యాగ్రౌండ్ స్కోర్ వాడిన విధానం ఆకట్టుకుంటోంది. అయితే.. అంతా బాగానే వుంది. కానీ.. ఇంతకీ కింగ్ నాగార్జున బుగ్గపై ముద్దు పెట్టిన అమ్మాయి ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అది తెలియాలంటే మొదలైన షోలో చూసి తెలుసుకోవాల్సిందే.
https://www.youtube.com/watch?v=iL3GoVqZIsk