రాజమౌళి-మహేశ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు?
జక్కన్న మహేశ్ మూవీ సెట్ మీదకు వెళ్లడానికి ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది.

జక్కన్న మహేశ్ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా టైమ్ పడుతుందా? ఇప్పట్లో స్క్రిప్ట్ పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదా? జక్కన్న ఉన్నట్టుండి ఆ కథను ఎందుకు పక్కన పెట్టేశారు? అసలు రాజమౌళి ఇప్పుడేం చేస్తున్నారు?
రాజమౌళి- మహేశ్ బాబు సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా. ఇరువురి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ, రాజమౌళి సినిమా వర్క్‌కు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కీరవాణి కుమారుడు శ్రీ సింహా పెళ్లి వేడుకల్లో జక్కన్న ఉన్నారు.. ఇటు మహేశ్ బాబు కూడా ఫారెన్ టూర్లతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. దీంతో జక్కన్న మహేశ్ మూవీ సెట్ మీదకు వెళ్లడానికి ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది.
రాజమౌళి ప్లానింగ్ ఎప్పుడు పాన్ వరల్డ్‌గా ఉంటుంది. సినిమాలో చాలా వరకు మెయిన్ క్యారెక్టర్స్ ఎక్కువ హాలీవుడ్ వాళ్లు ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. అంతే కాదు హాలీవుడ్‌లో ఓ రేంజ్ లో ఉన్న వాళ్లనే సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు మహేశ్ సినిమాకు మరోసారి హాలీవుడ్ సంచలనం. థోర్ ఫేం క్రిస్ హెమ్స్‌వర్త్ ని SSMB29 మూవీకి ఎంపిక చేసుకున్నాడని టాక్. దీంతో సినిమా స్టార్ట్ అవ్వక ముందే వరల్డ్ వైడ్‌గా సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నాడు జక్కన్న. మరి హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలి.
మరోవైపు ఈ మూవీలో మహేశ్ సరసన ప్రియాంక చోప్రా నటించనున్నారంటూ మరో గాసిప్ మొదలైంది. మొత్తానికి పూటకో గాసిప్.. రోజుకో ప్రచారంతో జక్కన్న నెక్ట్స్ మూవీ బజ్ క్రియేట్ అవుతూనే ఉంది. కాన్నీ జక్కన్న టీం నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావడం లేదు. మరి జక్కన్న ఈ మూవీపై ఇంకెన్ని రోజులు ఊరిస్తాడో చూడాలి.
Pushpa 2 : బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప-2’ ఊచకోత.. 11 రోజుల వసూళ్లు ఎంతంటే?