Pawan Kalyan : అన్నా లెజినోవా పోస్ట్.. భార్య కోరికని పవన్ కళ్యాణ్ తీరుస్తాడా?
తాజాగా అన్నా లెజినోవా ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో ముచ్చటించింది. (Pawan Kalyan)
Pawan Kalyan
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి యాక్టివ్ గా పోస్టులు చేస్తుంది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన పలు ఫొటోలు పోస్ట్ చేస్తూ, పలు విషయాల గురించి మాట్లాడుతూ ఫ్యాన్స్ కి బోలెడంత కంటెంట్ కూడా ఇస్తుంది.
తాజాగా అన్నా లెజినోవా ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో ముచ్చటించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇన్స్టాగ్రామ్ స్టోరీల రూపంలో చెప్పింది. అయితే కొద్దిసేపటికే అన్నా లెజినోవా ఆ పోస్టులను డిలేట్ చేసింది. కానీ అప్పటికే కొంతమంది ఫ్యాన్స్ ఆ కంటెంట్ ని వైరల్ చేసేసారు.
Also Read : Anna Lezhneva : ఏ తల్లికి అలాంటి పరిస్థితి రాకూడదు.. పవన్ భార్య ఎమోషనల్ పోస్ట్..
ఈ క్రమంలో ఓ నెటిజన్ మీరు చూడాలనుకున్న ప్రదేశాలు ఏంటి అని అడగ్గా అన్నా లెజినోవా సమాధానమిస్తూ.. రాక్-కట్ ఆర్కిటెక్చర్ టెంపుల్స్, ఎల్లోరా కేవ్స్, జైపూర్, చెర్రీ బ్లూసంస్ ఇన్ జపాన్ అని పోస్ట్ చేసింది. ఒకే రాతితో నిర్మాణం చేసి ఆలయాలు, ఎల్లోరా గుహలు, రాజస్థాన్ రాజధాని జైపూర్, చెర్రీ పూలు పూసే సమయంలో జపాన్ ని చూడటం అన్నా లెజినోవా కోరిక అని తెలుస్తుంది.
మరి పవన్ కళ్యాణ్ తన భార్య కోరికని తీరుస్తాడా? ఆ ప్రదేశాలకు తన భార్య అన్నా లెజినోవాని పవన్ తీసుకెళ్తారా చూడాలి. ఇలాగే మరిన్ని ప్రశ్నలకు కూడా అన్నా లెజినోవా ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.
Also Read : Anna Lezhneva : పవర్ స్టార్ ఫేవరేట్ ఫుడ్ ఏంటో చెప్పిన పవన్ భార్య.. పోస్ట్ వైరల్..
