Anna Lezhneva : పవర్ స్టార్ ఫేవరేట్ ఫుడ్ ఏంటో చెప్పిన పవన్ భార్య.. పోస్ట్ వైరల్..
తాజాగా పవన్ భార్య అన్నా లెజినోవా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తో చిట్ చాట్ నిర్వహించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. (Anna Lezhneva)
Anna Lezhneva
Anna Lezhneva : పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ అనేక ఆసక్తికర పోస్టులు చేస్తుంది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేస్తూ, పలు విషయాల గురించి మాట్లాడుతూ ఫ్యాన్స్ కి బోలెడంత కంటెంట్ కూడా ఇస్తుంది. దీంతో మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఈమెను ఫాలో అవుతున్నారు.
తాజాగా పవన్ భార్య అన్నా లెజినోవా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తో చిట్ చాట్ నిర్వహించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో మీకు వంట వండటం వచ్చా అని అడగ్గా.. మా అత్తమ్మ నుంచి నేను వంటలు నేర్చుకున్నాను. దోస, ఇడ్లీ, చట్నీ, కర్రీలు, పప్పులు, ఫిష్ పులుసు, గోంగూర, పాలక్ పన్నీర్, ప్రాన్స్ ఇగురు, బిర్యానీ.. ఇంకా చాలా నేర్చుకున్నాను. వెజ్ వంటలు ఎక్కువగా నేర్చుకున్నాను అని తెలిపింది.

అలాగే ఓ అభిమాని పవన్ కళ్యాణ్ గారికి ఏ ఫుడ్ ఎక్కువగా ఇష్టం అని అడగగా.. మా అత్తమ్మ చేసే మషాలా చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. నేను అది వండటం ఆమె నుంచి నేర్చుకున్నాను. అలాగే ఆయన వదినమ్మ(సురేఖ) చేసే చేపల పులుసు అంటే కూడా ఇష్టం అని తెలిపింది. అలాగే మరిన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్తుంది. దీంతో అన్నా లెజినోవా చేసే పోస్టులు వైరల్ గా మారాయి.

