RRR: వైరల్.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడుతుందా..?
రాజమౌళి మరో అద్భుత సృష్టి ఆర్ఆర్ఆర్. ఇప్పటికే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మరే ఇండియన్ సినిమా మీద లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సినిమా గురించి ఏ చిన్న పాటి అప్ డేట్ వస్తుందని ప్రకటించినా ప్రేక్షకులంతా ఎగ్జైట్ మూడ్ లోకి వెళ్తున్నారు.

Rrr
RRR: రాజమౌళి మరో అద్భుత సృష్టి ఆర్ఆర్ఆర్. ఇప్పటికే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మరే ఇండియన్ సినిమా మీద లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సినిమా గురించి ఏ చిన్న పాటి అప్ డేట్ వస్తుందని ప్రకటించినా ప్రేక్షకులంతా ఎగ్జైట్ మూడ్ లోకి వెళ్తున్నారు. ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ నుండి మేకింగ్ వీడియో, దోస్తీ సాంగ్ వచ్చి క్షణాల్లోనే భారీ వ్యూస్ దక్కించుకుంది. ఒక్క బాషలో కాదు యావత్ ఇండియా సినిమా చరిత్రలోనే ఆర్ఆర్ఆర్ వీడియోలకు భారీ క్రేజ్ దక్కుతుంది.
కాగా, ఇంతటి భారీ హైప్ ఉన్న సినిమా కావడంతోనే రూమర్స్ కూడా చాలా సింపుల్ గా వైరల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రమోషన్ పాటలో రాజమౌళితో గతంలో పనిచేసిన హీరోలందరూ ఉంటారని ప్రచారం చేశారు. కానీ, అది ఎంత మాత్రం నిజం కాదని తేలడంతో ఇప్పుడు ఏకంగా సినిమా రిలీజ్ డేట్ మీదనే మరో ప్రచారాన్ని సృష్టిస్తున్నారు. అదే అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల కష్టమేనని.
సినిమాకి బ్యాలన్స్ షూట్, పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఓ కాకి లెక్కలు వేస్తున్న కొందరు నెటిజన్లు ఇప్పటి వరకు యూనిట్ చెప్పినట్లుగా అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ విడుదల కావడం కష్టమేనని ప్రచారం మొదలు పెట్టారు. ప్రతిష్టాత్మక సినిమా కావడంతో ఇప్పుడు ఆ ప్రచారం తెగ వైరల్ అవుతుంది. అయితే.. ఇప్పటికీ యూనిట్ మాత్రం చెప్పిన డేట్ మీద కమిట్ అయిఉంది. కానీ మరోసారి మళ్ళీ ఏదో ఒక అప్ డేట్ రూపంలో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తే తప్ప ఈ ప్రచారానికి బ్రేక్ పడేలా లేదు.