Alia Bhatt : అలియా భట్ కట్టిన చీర ఖరీదెంతో తెలుసా?.. మరీ ఇన్ని లక్షలా..
బాలీవుడ్ నటి అలియా భట్ ఓ పెళ్లి వేడుకలో ఎల్లో చీరలో మెరిసిపోయారు. ప్రత్యేకమైన హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. ఆ వేడుక కోసం అలియా ధరించిన పసుపు రంగు చీర ఖరీదెంతో తెలుసా?

Alia Bhatt
Alia Bhatt : బాలీవుడ్ నటి అలియా భట్ ఓ పెళ్లి వేడుకలో కట్టుకున్న చీర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చీరలో ఏముంది? అని డౌట్ రావచ్చు… ఆ చీర ఖరీదు వింటే షాకవుతారు.
అలియా భట్ ఇటీవల తన స్నేహితురాలు దిశా పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. ఆ వేడుకలో ఎల్లో కలర్ ఆర్గాంజా శారీలో తళుక్కుమన్నారు. హెయిర్ స్టైల్ అయితే మరీ ప్రత్యేకంగా కనిపించింది. ఈ వేడుకలో అలియా ధరించిన ఎల్లో శారీకి చాలా ప్రత్యేకత ఉంది. అలియా ధరించిన పసుపురంగు చీర ఖరీదు అక్షరాల రూ.2.5 లక్షలు. చీరలో అద్భుతమైన అప్లిక్ వర్క్ కనిపించింది. ఇంకా చీర బోర్డర్ మొత్తం పక్షులు, ఆకులు, అందమైన పువ్వులతో వర్క్ చేసారు. ఇక ఈ చీరకి స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన అలియా ముత్యాలతో తయారు చేయబడిన చోకర్, దానికి తగ్గ చెవిపోగులతో అందంగా కనిపించారు.
Lokesh Kanagaraj : ఎక్కడా కనిపించనంటూ స్టార్ డైరెక్టర్ సంచలన ట్వీట్
అలియా హెయిర్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రెండు జడలను అల్లి వాటిని గోల్డెన్ కలర్ రిబ్బన్‌తో జత చేశారు. మొత్తానికి అలియా ఖరీదైన చీరతో ప్రత్యేకమైన హెయిర్ స్టైల్‌తో ఈ వేడుకలో అందరినీ ఆకట్టుకున్నారు. కాగా అలియా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని’ జూలై 28 న విడుదలైంది. 2024 లో అలియా చేతిలో జీలే జరా, జిగ్రా, బైజు బవారా, తఖ్త్ ప్రాజెక్టులు ఉన్నాయి.
View this post on Instagram