Lokesh Kanagaraj : ఎక్కడా కనిపించనంటూ స్టార్ డైరెక్టర్ సంచలన ట్వీట్

సోషల్ మీడియా..మొబైల్ ఫోన్ నుండి విరామం తీసుకుంటున్నా అంటూ ఓ స్టార్ డైరెక్టర్ పెట్టిన ట్వీట్ సంచలనంగా మారింది. ఎవరా డైరెక్టర్.. కారణం ఏంటి?

Lokesh Kanagaraj : ఎక్కడా కనిపించనంటూ స్టార్ డైరెక్టర్ సంచలన ట్వీట్

Lokesh Kanagaraj

Updated On : December 17, 2023 / 2:53 PM IST

Lokesh Kanagaraj : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తను సోషల్ మీడియా నుండి బ్రేక్ తీసుకుంటున్నానని, మొబైల్ ఫోన్‌కు అందుబాటులో ఉండనని ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. లోకేష్ ట్వీట్ వెనుక కారణం ఏంటి ?

Bigg Boss 7 Final : బిగ్‌బాస్ ఫినాలే ప్రోమో చూశారా? రవితేజ గెస్ట్‌గా.. అమర్ దీప్‌కి నాగ్ బంపర్ ఆఫర్..

లోకేష్ కనగరాజ్ స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నారు. ఖైదీ, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన లోకేష్ ‘లియో’తో మరో హిట్ అందుకున్నారు. దళపతి విజయ్, త్రిషతో తెరకెక్కించిన లియో నెగెటివ్ టాక్ వినిపించిన రూ.600 కోట్ల వసూళ్లను రాబట్టింది. కొందరు లియో సెకండ్ పార్ట్ బాలేదంటూ విమర్శలు చేశారు. ఇటీవలే లోకేష్ లియో సినిమా గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఇకపై సినిమా రిలీజ్ డేట్ ముందే అనౌన్స్ చేయనని స్పష్టం చేశారు. లియో సగం సినిమా తీసిన తర్వాత రిలీజ్ డేట్ దగ్గర పడుతోందన్న తొందరలో సెకండ్ పార్ట్ పై ఎక్కువ సమయం కేటాయించలేకపోయానని వెల్లడించారు.

Bagheera Teaser : ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా ‘భగీరా’ టీజర్ చూశారా.. సలార్ కంటే పవర్ ఫుల్ గా..

లోకేష్ కనగరాజ్ ఇటీవలే సొంత ప్రొడక్షన్ ‘జీ స్క్వాడ్’ బ్యానర్ ప్రారంభించారు. సొంత బ్యానర్‌లో నిర్మించిన మొదటి చిత్రం ‘ఫైట్ క్లబ్’ ఇటీవలే రిలీజైంది. అదలా ఉంటే లోకేష్ రజనీకాంత్‌తో సినిమా చేస్తున్నారు. దీంతో పాటు విక్రమ్ సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. జీ స్క్వాడ్ బ్యానర్‌పై తీసిన ఫైట్ క్లబ్ సినిమాను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు అంటూ రాసారు. సోషల్ మీడియా నుండి బ్రేక్ తీసుకుంటున్నట్లు .. మొబైల్ ఫోన్‌కి అందుబాటులో ఉండనని పేర్కొన్నారు. తన నెక్ట్స్ ప్రాజెక్టు పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అన్ని వేళలా తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అంటూ లోకేష్ కనగరాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పని పట్ల ఈ స్టార్ డైరెక్టర్ కి ఉన్న డెడికేషన్ కి చాలామంది ఫిదా అవుతున్నారు.