సిక్స్ ప్యాక్ తో అమ్మాయిల గుండెల్లో హీట్ పెంచిన యంగ్ హీరో
యంగ్ హీరో కార్తికేయ న్యూ లుక్ అదిరిపోయింది. సిక్స్ ప్యాక్ తో కేక పుట్టిస్తున్నాడు. చొక్కా లేకుండా తన కర్వ్డ్

యంగ్ హీరో కార్తికేయ న్యూ లుక్ అదిరిపోయింది. సిక్స్ ప్యాక్ తో కేక పుట్టిస్తున్నాడు. చొక్కా లేకుండా తన కర్వ్డ్
యంగ్ హీరో కార్తికేయ న్యూ లుక్ అదిరిపోయింది. సిక్స్ ప్యాక్ తో కేక పుట్టిస్తున్నాడు. చొక్కా లేకుండా తన కర్వ్డ్ బాడీతో ఫొటోలకు ఫొజులిచ్చాడు. తన కండలు తిరిగిన దేహంతో అమ్మాయిల గుండెల్లో హీట్ పుట్టిస్తున్నాడు. బేర్ బాడీతో ఉన్న కార్తికేయ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన న్యూ లుక్ ను కార్తికేయ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ”లాక్ డౌన్ మన ప్లాన్స్ ను చేంజ్ చేసింది కానీ మన గోల్స్(లక్ష్యాలు)పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేదు” అనే కోట్ తో తన న్యూ లుక్ పోస్టు చేశాడు.
చావుకబురు చల్లగా:
ప్రస్తుతం కార్తికేయ ‘చావుకబురు చల్లగా’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ విడుదలైంది. బస్తీ మాస్ కుర్రాడిగా ఈ మూవీలో కార్తికేయ కనిపించనున్నాడు. 2019లో కార్తికేయ ఏకంగా హిప్పీ, గుణ 369, 90 ఎమ్ ఎల్ అనే మూడు చిత్రాలు విడుదల చేశాడు. వాటిలో గుణ 369 మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు కార్తికేయకు నటుడిగా మంచి పేరు తెచ్చింది. ఇక థియేటర్స్ లో అంత ఆదరణ దక్కించుకోని 90ఎం ఎల్ మూవీ, బుల్లి తెరపై అద్భుత రేటింగ్ సాధించింది. అయితే ఆర్ఎక్స్ 100 తర్వాత ఆ స్థాయి హిట్ కార్తికేయ అందుకోలేదు.
ఆర్ఎక్స్ 100 లాంటి సాలిడ్ హిట్ కొట్టాలని లక్ష్యం:
ఈ కుర్ర హీరో ఊహించని విధంగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో చావుకబురు చల్లగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో కార్తికేయకి జోడీగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాతో కౌశిక్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. శవాలని తీసుకెళ్లే అంబులెన్స్ డ్రైవర్ గా బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాతో ఎలా అయినా సాలిడ్ హిట్ కొట్టాలని కార్తికేయ కసిగా ఉన్నాడు.
లాక్ డౌన్ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న యంగ్ హీరో:
ప్రస్తుతం అంతా లాక్ డౌన్. ఆ రంగం ఈ రంగం అని లేదు, అన్నీ మూతబడ్డాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ సినీ రంగంపైనా తీవ్రంగానే ఉంది. షూటింగ్ లు నిలిచిపోయాయి. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. దాదాపు రెండు నెలల పాటు లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ లాక్ డౌన్ సమయాన్ని యువ హీరో కార్తికేయ పర్ఫెక్ట్ గా సద్వినియోగం చేసుకున్నాడు. బాగా కసరత్తు చేసి సిక్స్ ప్యాక్స్ బాడీ సాధించాడు.
Lockdown changed our plans..
But it can’t effect our goals?♂️ pic.twitter.com/Zgm7u8hdZq— Kartikeya Gummakonda (@ActorKartikeya) May 27, 2020