10 కిలోల బంగారంతో వైష్ణో దేవి ఆలయ ద్వారం

వైష్ణో దేవి. ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ వైష్ణో దేవి యాత్ర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్ము పర్వత సానుముల్లోని త్రికూట పర్వతమంపై కొలువైన వైష్ణోదేవీ యాత్ర సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అమ్మవారి పరమ పవిత్రమైన ఆలయం ద్వారం పసిడి కాంతులతో మెరిసిపోనుంది.
దసరా నవరాత్రులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పూలతో అలంకరించబడి భక్తులను సాదరాంగా ఆహ్వానిస్తుంది. పాలరాయితో నిర్మించిన అమ్మవారి ప్రవేశద్వారాన్ని 10 కిలోల బంగారంతో తాపడం చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇకపై పసిడి ద్వారం గుండా అమ్మవారిని దర్శించుకోనున్నారు.
ఈ ద్వారం మూడవసారి పునరుద్ధరించబడుతోంది.1962 లో వైష్ణోదేవి గుహ మందిరం ప్రవేశద్వారం దగ్గర పాలరాయితో నిర్మించటానికి ఒక భక్తుడు ఇవ్వగా దాన్ని పాలరాయితో నిర్మించారు. అనంతరం ఆ పాలరాయి నిర్మాణాన్ని 2005లో శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం బోర్డు మక్రానా మరోసారి పాలరాయితో నిర్మించింది. ఈ క్రమంలో మూడవ సారిగా పాలరాయి స్థానంలో ఇప్పుడు 10కిలోల బంగారంతో తయారు చేస్తున్నారు.