Tent city In Varanasi : వారణాసిలో టెంట్ సిటీని ప్రారంభించిన ప్రధాని మోడీ..

భారతీయ ఆధ్యాత్రికమ రాజధాని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో టెంట్ సిటీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. పవిత్ర గంగా నదీ ఒడ్డున ఏర్పాటు చేసిన టెంట్ సిటీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.

Tent city In Varanasi : వారణాసిలో టెంట్ సిటీని ప్రారంభించిన ప్రధాని మోడీ..

Tent city In Varanasi

Updated On : January 13, 2023 / 3:08 PM IST

Tent city In Varanasi : భారతీయ ఆధ్యాత్రికమ రాజధాని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో టెంట్ సిటీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. శుక్రవారం (జనవరి 13,2023) పవిత్ర గంగా నదీ ఒడ్డున ఏర్పాటు చేసిన టెంట్ సిటీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రతీ ఏటా కాశీకి ఎంతోమంది యాత్రీకులు వస్తుంటారు. కాశీకి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. పరమ శివుడు కాశీ విశ్వేశ్వరుడుగా వెలసి పూజలందుకునే ఈ కాశీకి శివరాత్రి పండుగతో పాటు సెలవు రోజుల్లో భక్తులు అధికా సంఖ్యలో వస్తుంటారు. స్వామివారిని దర్శించుకోవటానికి భారీగా వచ్చే భక్తులు, పర్యాటకులకు వసతి సమస్య లేకుండా గంగానదీ ఒడ్డున 100హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. టెంట్లతో నివాస కుటీరాలను అందంగా తీర్చిదిద్దారు. ఈ టెట్ సిటీ ఏర్పాటుతో ఇక కాశీకి వచ్చే భక్తులకు ఎటువంటి వసతి లేదనే సమస్యే ఉండదు. చక్కగా టెంట్ హౌస్ లో బస చేయొచ్చు. ఫైవ్ స్టార్ రేంజ్ ఏర్పాట్లున్నాయి ఈ టెంట్ హౌసెస్ లో.

ఈ టెంట్ సిటీకి సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ట్విట్టర్ లో షేర్ చేశారు. బెనారస్ లో అందమైన టెంట్ సిటీని ప్రధాని మోదీ ప్రారంభించారని వెల్లడించారు.‘‘కాశీలో పర్యాటకానికి ఇది పెద్ద చక్కటి సౌకర్యవంతంగా ఉంటుందని..ప్రపంచం నలుమూలల నుంచి ఘనమైన వారసత్వం ఉన్న ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి భక్తులు వస్తుంటారు’’ అని పేర్కొన్నారు అమిత్ మాలవీయ.

 

ఈ టెంట్ కాటేజీలు కేవలం సాధారణ టెంట్ల వలె ఉండవు.వీటిలో డీలక్స్ టెంట్స్ కూడా ఉన్నాయి. గంగా ఘాట్ సమీపంలో 100 హెక్టార్లలో టెంట్ సిటీని నిర్మించిన ఈ టెంట్ హౌసెస్ చక్కటి అనుభూతిని కలిగిస్తాయి. వారణాసి నుంచి రామ్ నగర్ వెళుతుంటే ఈ టెంట్ సిటీ కనిపిస్తుంది. ఈ టెంట్స్ లో గంగా దర్శన్ విల్లాస్, ప్రీమియం టెంట్స్, సూపర్ డీలక్స్ టెంట్స్ అనే మూడు విభాగాలుగాలున్నాయి.

వీటిలో చిన్నపాటి ఫ్రిజ్, టీవీ, గీజర్, రూమ్ హీటర్ లతో పాటు మిగిలిన సౌకర్యాలు కూడా ఏర్పాటుచేశారు. ఎయిర్ కండిషన్డ్ టెంట్‌లలో కింగ్ సైజ్ బెడ్‌లు, హాల్ మరియు రాజ్‌వాడి సోఫా సెట్, డైనింగ్ టేబుల్, స్టడీ టేబుల్, ల్యాంప్,డ్రెస్సింగ్ టేబుల్ వంటి ఇతర సౌకర్యాలు ఉంటాయి. ఒక్కోటి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రీమియం,డీలక్స్ టెంట్ రూమ్ కు రూ.12,000-14,000 చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 14న నుంచి భక్తులకు ఈ టెంట్ సిటీ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ఈ టెంట్ హౌసెస్ బుక్కింగ్స్ ప్రారంభమయ్యాయి. వీటిలో బస చేసేవారు గంగా హారితిని చూడవచ్చు. టెంట్ సిటీలో ఆల్కహాల్,మాంసాహారాలకు అనుమతిలేదు. ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ అయిన MV గంగా విలాస్ క్రూయిజ్‌ ప్రారంభించిన ప్రధాని మోడీ ఈ టెంట్ హౌస్ లను కూడా వర్చువల్ గా ప్రారంభించారు.