చెరుకు తోటలోకి తీసుకెళ్లి.. 13ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్, హత్య

  • Published By: naveen ,Published On : August 16, 2020 / 04:35 PM IST
చెరుకు తోటలోకి తీసుకెళ్లి.. 13ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్, హత్య

Updated On : August 17, 2020 / 10:13 AM IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్మీపూర్ కేరి జిల్లాలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసి అతి కిరాతకంగా చంపేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం(ఆగస్టు 14,2020) ఇసానగర్ లో బాలిక గ్యాంగ్ రేప్, హత్యకు గురైంది. ఇసానగర్ లోని చెరుకు తోటలో బాలిక మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.



ఈ కేసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాము. సామూహిక అత్యాచారం, హత్య నేరాల కింద కేసులు నమోదు చేశాము. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాము అని లక్మీపూర్ కేరి జిల్లా ఎస్పీ సత్యేంద్ర కుమార్ తెలిపారు.

చెరుకు తోటల్లో బాలిక మృతదేహాన్ని గుర్తించాము. ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. బాలికను రేప్ చేసినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇద్దరు నిందితులు సంతోష్ యాదవ్, సంజయ్ గౌతమ్ లను అరెస్ట్ చేసి జైలుకి పంపాము అని ఎస్పీ వెల్లడించారు. ఐపీసీ సెక్షన్ 302(హత్య), సెక్షన్ 376(డీ)(గ్యాంగ్ రేప్) కింద నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. అలాగే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద విచారణ జరుపుతామన్నారు.



ఆడపిల్లలు, మహిళల రక్షణ కోసం నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట బాలికలు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి కాటేస్తున్నారు. సామూహిక అత్యాచారాలు చేసి హత్యలు కూడా చేస్తున్నారు. రేపిస్టులను ఉరి తీస్తున్నా, కఠిన శిక్షలు విధిస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఆడపిల్ల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇంటి నుంచి బయటకు వెళ్లి అమ్మాయి తిరిగి ఇంటికి సురక్షితంగా వస్తుందో లేదోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రేపిస్టులను స్పాట్ లోనే శిక్షించాలని, బహిరంగంగా ఉరి తియ్యాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే మృగాళ్లలో మార్పు వస్తుందని అభిప్రాయపడుతున్నారు.