Swimming Record : 8గంటల పాటు ఈత కొట్టి ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ నమోదు చేసిన 15 ఏళ్ల అమ్మాయి..
8 గంటలపాటు ఈత కొట్టడం అంటే మామూలు విషయం కాదు. చంద్రకళ అనే 15 ఏళ్ల అమ్మాయి నాన్ స్టాప్ గా ఈత కొట్టి 'గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో పేరు సంపాదించుకుంది.

Golden Book of World Record
Swimming Record : చెరువులో సరదాగా ఈత కొట్టే కుర్రకారు చాలామందే ఉంటారు. ఏదో కాసేపు అంటే సరదాగా ఈత కొడతారు. 8 గంటలు చెరువులో ఈత కొట్టడం అంటే మామూలు విషయం కాదు. స్విమ్మింగ్‌నే (swimming) తన కెరియర్ గా మార్చుకోవాలని డిసైడైన చంద్రకళ (chandra kala) నాన్ స్టాప్ గా ఈత కొట్టి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది. ఇంతకీ ఎవరీ అమ్మాయి
Guinness Record : 46 కీళ్లు విరుచుకుని వరల్డ్ రికార్డ్.. ఈ కుర్రాడు మామూలోడు కాదు
ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) దుర్గ్ జిల్లా ( Durg district) పురాయ్ విలేజ్ (Purai village ) కి చెందిన చంద్రకళకు 15 ఏళ్లు. 10వ తరగతి చదువుతున్న చంద్రకళ స్విమ్మింగ్ లో జాతీయ, రాష్ట్ర స్ధాయి క్రీడాకారులున్న (players) కుటుంబంలో నుంచి వచ్చింది. చిన్నతనం నుంచి చంద్రకళకు స్విమ్మింగ్ అంటే చాలా ఆసక్తి. 5 సంవత్సరాల వయసు నుంచి అందులో ప్రతిభ చూపిస్తూ ఓపెన్ నేషనల్, స్టేట్ ఛాంపియన్‌షిప్‌లలో బంగారు, రజత పతకాలు గెలుచుకుంది. ఆమె అక్క భూమిక, తమ్ముడు సిద్దార్థ్ లు కూడా స్విమ్మర్సే.
Saree Walkathon : సూరత్ లో 15000 మంది మహిళల “శారీ వాకథాన్”..భారత్‌లో అతి పెద్ద రికార్డ్
రికార్డు నెలకొల్పడానికి ముందు చంద్రకళ ఉదయం 5.10 నిముషాలకు పురాయిలోని చెరువులో ఈత కొట్టడం ప్రారంభించింది. మధ్యాహ్నం 1.10 గంటల వరకూ ఆపకుండా ఈత కొడుతూనే ఉంది. అలా గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను (Golden Book of World Records) సొంతం చేసుకుంది. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆసియా హెడ్ డాక్టర్ మనీష్ బిష్ణోయ్ (Dr Manish Bishnoi) ఆమె సాధించిన రికార్డును ధృవీకరించారు. హోం మంత్రి తామ్రధ్వాజ్ సాహు (Tamradhwaj Sahu) ఆమెకు సర్టిఫికేట్ మరియు పతకాన్ని ప్రదానం చేశారు. ఆ ఈ రికార్డు సాధించడం కోసం చంద్రకళ ఎంతో కష్టపడింది. కోచ్ ఓం కుమార్ ఓజా (Om Kumar Ojha) పర్యవేక్షణలో రోజులో 10 నుంచి 12 గంటలు ప్రాక్టీస్ చేసింది. ఇక గ్రామస్తుల నుంచి కూడా ఆమెకు మంచి సపోర్ట్ దొరికింది. తన రికార్డ్‌తో గ్రామానికి పేరు తెచ్చిన చంద్రకళను గ్రామస్తులు అభినందించారు.
Guinness Record : 4 ఏళ్లకే గిన్నిస్ రికార్డ్.. ఆ బుడతడు చేసిన పనికి ఆశ్చర్యపోతారు..
చంద్రకళ స్విమ్మింగ్ తన కెరియర్ గా కొనసాగించాలనుకుంటోంది. అందుకోసం ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. అందుకోసం అధికారులు తమ గ్రామంలో స్విమ్మింగ్ పూల్, ఏర్పాటు చేయాలని కోరుతోంది. భవిష్యత్‌లో చంద్రకళ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టాలని మనసారా కోరుకుందాం.