ఎలా భరించిందో : కడుపులో 1500 రాళ్లు

కిడ్నీలో రాళ్లు ఉండడం వింటుంటాం..ఇదేంటీ..కడుపులో రాళ్లు ఉండడం అని అనుకుంటున్నారా..కానీ నిజంగానే ఇది జరిగింది. ఓ మహిళ కడుపులో 1500 రాళ్లను తొలగించారు వైద్యులు. ఈ అరుదైన చికిత్స లూథియానాలో జరిగింది. ప్రేమలత హర్యానా వాసి. కొన్ని సంవత్సరాలుగా ఈమె కడుపునొప్పితో బాధ పడుతోంది. ఎన్నో ఆస్పత్రులు తిరిగి..మందులు వాడింది. కానీ నొప్పి మాత్రం తగ్గలేదు. చివరకు 2019, ఆగస్టు 23వ తేదీన లూథియాలోని ప్రజా వైద్య శాలను సంప్రదించింది. డాక్టర్ మిల్నే వర్మ ఆమెను పరీక్షించాడు.
స్కానింగ్ చేశారు. కడుపులో రాళ్లున్నట్లు గుర్తించారు. సుమారు 15 వందలకు పైగానే ఉండడం షాక్ తిన్నారు వైద్యులు. రాళ్లను తొలగించేందుకు ఆపరేషన్ నిర్వహించాలని చెప్పారు. రాళ్ల పరిమాణం తక్కుగా ఉండడంతో ల్యాపోస్కోపీ విధానంలో ఆపరేషన్ చేశారు డాక్టర్లు. ఎన్ని రాళ్లున్నాయో నర్సులు లెక్క పెడుతున్నారని, సదరు మహిళ జ్వరం, జాండీస్ వ్యాధితో బాధ పడిందన్నారు.
అయితే..ఏదైనా అనారోగ్యం కలిగితే..వెంటనే వైద్యులను సంప్రదించడం మేలని సూచించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుట పడుతోందని వైద్యులు వెల్లడించారు. ఆపరేషన్ చేసిన వైద్యులకు ఆమె సోదరి కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉందని..ఆపరేషన్ చేసిన మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యిందని తెలిపారు.