ఈ-కామర్స్ పై పోలీసుల ఎటాక్ : 15వేల లీటర్ల పాలు,10వేల కేజీల కూరగాయాలు చెత్త కుప్పలోకి

  • Published By: venkaiahnaidu ,Published On : March 25, 2020 / 02:46 PM IST
ఈ-కామర్స్ పై పోలీసుల ఎటాక్ : 15వేల లీటర్ల పాలు,10వేల కేజీల కూరగాయాలు చెత్త కుప్పలోకి

Updated On : March 25, 2020 / 2:46 PM IST

దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ ను మంగళవారం ప్రధాన నరేంద్రమోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ముఖ్యమైన అంటే పాలు,సరుకులు,కూరగాయలు,మెడిసిన్లు,ఫుడ్ ను డెలివరీ చేసే ఈ కామర్స్ కంపెనీలలను పోలీసులు వేధిస్తున్నారని,ఈ కామర్స్ కంపెనీలు దాడులను ఫేస్ చేస్తున్నాయరని వాళ్లు తెలిపారు. దీని వల్ల లాక్ డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లో తీవ్రమైన అసౌకర్యాలకు ఈ పరిస్థితులు దారితీస్తాయని ఈ-కామర్స్ కంపెనీలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో అత్యవసర జోక్యం చేసుకోవాలని ఆన్ లైన్ రీటైలర్స్ కోరుతున్నారు. అంతరాయల కారణంగా భారీ స్థాయిలో కూరగాయలు,పాలు వంటి పడేయవలసి వచ్చిందని వాళ్లు చెబుతున్నారు.

బిగ్ బాస్కెట్,ప్రెష్ మెనూ,పోర్టియా మెడికల్ వంటి ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంల ప్రమోటర్ కే గణేష్ మాట్లాడుతూ…గడిచిన కొన్ని రోజులుగా పోలీసులు తమను తిట్టారు,కొట్టారు,ఓ సందర్భంలో డెలివరీ ఏజెంట్ ను అరెస్ట్ కూడా చేశారని తెలిపారు. దీనివల్ల తమ కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయానికి దారితీస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం కచ్చితంగా సరైన నిర్ణయమే తీసుకున్నప్పటికీ,ఎసెన్షియల్ సర్వీసులను మాత్రం మినహాయింపు ఇచ్చిందని, సరుకుల ఆన్ లైన్ డెలివరీ,గ్రాసరీస్(కిరాణా),ఫుడ్,మెడిసిన్స్,మెడికల్ పరికరాలు వంటివి వాటిని కూడా ఎసెన్షియల్ సర్వీసుల కింద గుర్తించినప్పటికీ ఈ మెసేజ్ క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరలేదని ఆయన తెలిపారు.

అయితే కొన్ని చోట్ల పోలీసులకు ఇది ఒక ముఖ్యమైన సేవ అని తెలియదు, ఒకరిని అనుమతించడానికి మరియు అనుమతించకపోవడానికి యంత్రాంగం లేదని, అనేక సందర్భాల్లో, వారు కఠినంగా వ్యవహరిస్తున్నారు, వా ప్రజలను కొడుతున్నారని, కేరళలో, రోగికి సేవ చేయడానికి వెళుతున్న మా ఆరోగ్య కార్యకర్తలలో ఒకరిని అరెస్టు చేశారు అని ఆయన అన్నారు. ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు, దయచేసి వారిని కొట్టవద్దు. చలాన్ వాధించండి. సహచరులు కొట్టబడినందున ప్రజలు పారిపోతే, మేము ఏమీ చేయలేము. వస్తువులు మరియు సేవలను అందించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను కొట్టవద్దు అని గణేష్ తెలిపారు.

గణేష్ స్టేట్ మెంట్ ను ఆన్‌లైన్ గ్రాసరీ రీటైలర్ గ్రోఫర్స్ అండ్ మీట్ డెలివరీ ప్లాట్‌ఫాం  ప్రెష్ హోం సమర్థించాయి. అంతరాయాలు కారణంగా చాలా వృధా అయ్యాయి. వినియోగదారులకు, కిరాణా మరియు పాల డెలివరీ వెబ్‌సైట్ మిల్క్‌బాస్కెట్‌ కు ఇచ్చిన సందేశంలో… 15 వేల లీటర్ల పాలు, 10,000 కిలోల కూరగాయలను బలవంగా పారవేయవలసి వచ్చిందని, లాక్డౌన్ చేసిన 2 వ రోజు కూడా గుర్గావ్, నోయిడా మరియు హైదరాబాద్ లలో తాజా పాలను అందించలేమని ఆన్‌లైన్ గ్రాసరీ రీటైలర్ గ్రోఫర్స్ అండ్ మీట్ డెలివరీ ప్లాట్‌ఫాం ప్రెష్ హోం తెలిపాయి.