Heart Attack : గర్బా డాన్స్ చేస్తూ యువకుడు గుండెపోటుతో మృతి

గర్బా డాన్స్ చేస్తూ 19 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ లో వెలుగుచూసింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన 19 ఏళ్ల వినీత్ మెహుల్‌భాయ్ కున్వారియా గర్బా డాన్స్ ప్రాక్టీస్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు....

Heart Attack : గర్బా డాన్స్ చేస్తూ యువకుడు గుండెపోటుతో మృతి

Garba practice

Updated On : September 28, 2023 / 10:29 AM IST

Heart Attack : గర్బా డాన్స్ చేస్తూ 19 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ లో వెలుగుచూసింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన 19 ఏళ్ల వినీత్ మెహుల్‌భాయ్ కున్వారియా గర్బా డాన్స్ ప్రాక్టీస్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

Drugs Case : డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్

గుండెపోటుతో వినీత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. (Heart Attack during Garba practice) గతంలో గుజరాత్‌లోని జునాగఢ్‌లో చిరాగ్ పర్మార్ అనే 24 ఏళ్ల యువకుడు గర్బా డాన్స్ సాధన చేస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించాడు. జామ్‌నగర్‌తో పాటు గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో జిమ్‌లు, క్రికెట్ గ్రౌండ్‌లు, పాఠశాలల్లో గుండెపోటు కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి.

Asian Games 2023 : పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం

జునాగఢ్ నివాసి గత 10 సంవత్సరాలుగా నవరాత్రి సందర్భంగా గర్బా పోటీల్లో గెలుపొందారు. ఈ ఏడాది కూడా పోటీలో విజయం సాధించేందుకు సిద్ధమవుతుండగా, ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. కొన్ని నెలల క్రితం జామ్‌నగర్‌కు చెందిన 41 ఏళ్ల కార్డియాక్ డాక్టర్ తన సొంత ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు.

Massive Traffic in Bengaluru : ఒక కిలోమీటర్ ప్రయాణానికి 2 గంటల సమయం…భారీ ట్రాఫిక్‌తో రాత్రికి ఇంటికి చేరిన పాఠశాల విద్యార్థులు

మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు. తన మేనల్లుడు గర్బా డాన్స్ చేస్తూ కిందపడి గుండెపోటుతో మరణించాడని అతని మామ దర్శన్ జోషిపుర అన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది.