Bank Strike: దేశవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె
ప్రభుత్వరంగ బ్యాంకులు రెండ్రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునిచ్చారు. అఖిల భారత బ్యాంకర్ల సంఘం ఇచ్చిన పిలుపుమేర

Bank Strike
Bank Strike: ప్రభుత్వరంగ బ్యాంకులు రెండ్రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునిచ్చారు. అఖిల భారత బ్యాంకర్ల సంఘం ఇచ్చిన పిలుపుమేరకు డిసెంబర్ 16, డిసెంబర్ 17వ తేదీల్లో మూతపడనున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటికరించేందుకు కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నిరసన వ్యక్తం చేస్తూ.. బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకింగ్ అమెండ్మెంట్ చట్ట సవరణ ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రం.. బ్యాంకులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కుట్ర చేస్తుందని బ్యాంకు సంఘాల ఆరోపిస్తున్నారు.
………………………………. : బస్సులో ఎగ్జిట్ డోర్ ఎక్కడుందో డ్రైవర్‌కే తెలియదు