రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఫుడ్ పాయిజన్

  • Published By: venkaiahnaidu ,Published On : April 7, 2019 / 11:47 AM IST
రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఫుడ్ పాయిజన్

Updated On : April 7, 2019 / 11:47 AM IST

న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఆదివారం(ఏప్రిల్-7,2019) ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 20మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.అస్వస్థతకు గురైనవారిలో చిన్నారులు కూడా ఉన్నారు.అస్వస్థతకు గురైన ప్రయాణికులకు వైద్యసాయం అందించేందుకు రైలుని జార్ఖండ్ లోని బొకారో స్టేషన్ లో అధికారులు నిలిపివేశారు.ఫుడ్ పాయింజనింగ్ పట్ల ఆగ్రహానికి గురైన కొందరు రైలు ప్రయాణికులు బొకారో స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు.పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు సీనియర్ రైల్వే అధికారులు స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు.

ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం..శనివారం సాయంత్రం న్యూఢిల్లీ స్టేషన్ నుంచి రైలు బయల్దేరిన కొద్ది సేపటి తర్వాత ప్రయాణికులకు ఫుడ్ సప్లయి చేశారని,ఫుడ్ తిన్న వెంటనే B3,B5,B7,B9 కోచ్ లలోని కొంతమంది ప్రయాణికులు ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారని,కడుపునొప్పితో బాధపడ్డారని,వాంతులు చేసుకున్నారని,లూజ్ మోషన్స్ తో ఇబ్బందిపడ్డారని తెలిపారు.బొకారో స్టేషన్ దగ్గర రైలు ఆగే సమయానికి పలువురి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని తెలిపారు.  

ఫుడ్ పాయిజనింగ్ పై రైల్వే ప్రతినిధి స్పందిస్తూ…అస్వస్థతకు గురైన వారి ఆరోగ్యం ప్రస్థుతం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.పాంట్రీ కార్ చెక్ చేస్తున్నాం. ఫుడ్ క్వాలిటీని దర్యాప్తు చేసేందుకు ఫుడ్ శాంపిల్స్ ను కలెక్ట్ చేశామని తెలిపారు.ఐఆర్ సీటీసీ కూడా ఫుడ్ శాంపిల్స్ ను సేకరించింది.