Rajasthan : 26 ఏళ్ల యువకుడి కడుపులో 56 బ్లేడ్లు .. షాక్ అయిన డాక్టర్లు

రాజస్థాన్ కు చెందిన ఓ యువకుడు బ్లేడ్లు మింగేశాడు. అలా ఒకటి రెండూ కాదు ఏకంగా 56 బ్లేడ్లు మింగేశాడు.

Rajasthan : 26 ఏళ్ల యువకుడి కడుపులో 56 బ్లేడ్లు .. షాక్ అయిన డాక్టర్లు

man swallows 56 razor blades in Rajasthan..survived after surgery

Updated On : March 15, 2023 / 11:27 AM IST

Rajasthan :  రాజస్థాన్ కు చెందిన ఓ యువకుడు బ్లేడ్లు మింగేశాడు. అలా ఒకటి రెండూ కాదు ఏకంగా 56 బ్లేడ్లు మింగేశాడు. రాజస్థాన్ లోని జాలోర్ జిల్లాకు చెందిన యశ్ పాల్ అనే 26 ఏళ్ల యువకుడు 56 బ్లేడులతో ఉన్న ప్యాకెట్ మింగేశాడు. మరి తెలిసే మింగాడా? లేదా తెలియకుండా మింగాడా? అనే విషయంపై అతను ఎటువంటి సమాధానం చెప్పలేదు. కానీ తెలిసి మింగినా తెలియక మింగినా బ్లేడ్లు కడుపులోకి వెళ్లితే ప్రమాదమే కదా..ఏదోక సమస్య వచ్చే తీరుతుంది. అదే జరిగింది యశ్ పాల్ విషయంలో ఓ రోజు రక్తపు వాంతులు చేసుకున్నాడు. దీంతో కంగారుపడిపోయిన అతని స్నేహితులు వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లటంతో డాక్టర్లు స్కానింగ్ తీయగా కడుపులో బ్లేడ్లు ఉన్నాయని గుర్తించారు. అది చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. అదే విషయం చెప్పగా యశ్ పాల్ స్నేహితులకైతే దిమ్మ తిరిగిపోయింది. బ్లేడ్లు ఎలా మింగావురా బాబూ అంటూ షాక్ అయ్యారు..

Hair In Stomach : బాలిక కడుపులో 2 కిలోల వెంట్రుకలు…ప్రాణం కాపాడిన వైద్యులు

జాలోర్ జిల్లా సంచోర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల యశ్ పాల్ ఓ ప్రైవేటు కంపెనీలో డెవలపర్ గా పనిచేస్తున్నాడు. యశ్ తన నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి బాలాజీ నగర్ లో రెంట్ కు ఉంటుంన్నాడు. ఈక్రమంలో గత ఆదివారం (మార్చి12,2023)న ఫ్రెండ్స్ అందరు వారి వారి పనులపై బయటకెళ్లారు. రూమ్ లో యశ్ పాల్ ఒక్కడే ఉన్నాడు. ఈసమయంలో అతనికి వాంతులయ్యాయి. అంతా రక్తం. అదిచూసి యశ్ కంగారుపడిపోయాడు. వెంటనే ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు.దీంతో వెంటనే రూమ్ కు వచ్చిన యశ్ ను సంచోర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా పరిస్థితి విన్న డాక్టర్ల్ ఎక్స్ రే తీయగా అతని కడుపులో లోహానికి సంబంధించిన వస్తువులు కనిపించటంతో డాక్టర్ సోనోగ్రఫీ, ఎండోస్కీపీ చేశారు. దీంతో యశ్ కడుపులో బ్లేడ్లు ఉన్నాయని నిర్ధారించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని లేకుండా ప్రమాదమని హెచ్చరించారు.

Newborn Baby Foetus: 40రోజుల పసిబిడ్డ కడుపులో మరో పిండం

దీంతో వెంటనే ఆపరేషన్ కు అంగీకరించటంతో సర్జరీ చేసి యశ్ పాల్ కడుపులోంచి 56 బ్లేడు ముక్కలను బయటకు తీశారు. ప్రస్తుతం యశ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని బ్లేడుపై ఉన్న కవర్‌తోనే బాధితుడు బ్లేడ్లను మింగేయడంతో అతడికి నొప్పి కలగలేదని చెప్పుకొచ్చారు డాక్టర్లు. బ్లేడ్ల ప్యాకెట్ పొట్టలోకి చేరాక పైన ఉన్న ప్యాకెట్ కవర్ జీర్ణమైపోయింది. దీంతో ఇనుము బ్లేడ్లు తమ ప్రతాపం చూపించటంతో యశ్ కు రక్తపువాంతులు అయ్యాయని తెలిపారు. యశ్ పాల్ పరిస్థితి గురించి అతని కుటుంబ సభ్యులకు కూడా తెలియలేదు. బ్లేడ్లు ఎలా మింగాడో ఎందుకు మింగాడో తెలియదంటున్నారు. అదే విషయాన్ని యశ్ ను అడిగినా సమాధానం చెప్పలేదు. కానీ ఏది ఏమైనా బ్లేడ్లను సర్జరీ ద్వారా బయటకు తీయటంతో యశ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

Unborn Twin In One Year Baby Brain : ఏడాది చిన్నారి మెదడులో పెరిగిన పిండం..! నాలుగు అంగుళాలు పిండానికి అవయవాలు, గోళ్లు..!!