Manipur Violence Cases : మణిపుర్ అల్లర్ల కేసుల దర్యాప్తునకు 53 మంది సీబీఐ అధికారులు

మణిపుర్ హింసాకాండ కేసుల విచారణకు దేశవ్యాప్తంగా ఉన్న తమ యూనిట్ల నుంచి 29 మంది మహిళలతో సహా 53 మంది అధికారులను సీబీఐ నియమించింది. ముగ్గురు డిఐజిలు లవ్లీ కతియార్, నిర్మలా దేవి, మోహిత్ గుప్తా, పోలీసు సూపరింటెండెంట్ రాజ్‌వీర్‌లతో కూడిన బృందం మొత్తం దర్యాప్తును పర్యవేక్షించే జాయింట్ డైరెక్టర్ ఘనశ్యామ్ ఉపాధ్యాయ్‌కు నివేదిస్తారని సీబీఐ తెలిపింది....

Manipur Violence Cases : మణిపుర్ అల్లర్ల కేసుల దర్యాప్తునకు 53 మంది సీబీఐ అధికారులు

CBI Officers To Probe

Manipur Violence Cases : మణిపుర్ హింసాకాండ కేసుల విచారణకు దేశవ్యాప్తంగా ఉన్న తమ యూనిట్ల నుంచి 29 మంది మహిళలతో సహా 53 మంది అధికారులను సీబీఐ నియమించింది. ముగ్గురు డిఐజిలు లవ్లీ కతియార్, నిర్మలా దేవి, మోహిత్ గుప్తా, పోలీసు సూపరింటెండెంట్ రాజ్‌వీర్‌లతో కూడిన బృందం మొత్తం దర్యాప్తును పర్యవేక్షించే జాయింట్ డైరెక్టర్ ఘనశ్యామ్ ఉపాధ్యాయ్‌కు నివేదిస్తారని సీబీఐ తెలిపింది. (53 CBI Officers To Probe Manipur Violence Cases) ఇంత పెద్ద సంఖ్యలో మహిళా అధికారులను ఏకకాలంలో విచారణ జరపనుండటం మొదటిసారి. (29 Women) సీబీఐ విచారిస్తున్న ఈ కేసుల్లో చాలా వరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం 1989లోని నిబంధనల ప్రకారం లోనివేనని సీబీఐ వర్గాలు తెలిపాయి.

Flash Floods : హిమాచల్, ఉత్తరాఖండ్ వరదల్లో 81కి పెరిగిన మృతుల సంఖ్య

ఇద్దరు అదనపు పోలీసు సూపరింటెండెంట్లు,ఆరుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లు ఆఫ్ పోలీసులు అందరూ మహిళలే. ఈ సీబీఐ బృందంలో 16 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు కూడా ఉన్నారు. మణిపుర్ విషయంలో దర్యాప్తులో పక్షపాత ఆరోపణలు రాకుండా స్థానిక అధికారుల పాత్రను తగ్గించామని సీబీఐ అధికారులు తెలిపారు. మణిపుర్ హింసాకాండపై ఇప్పటికే 8 కేసులను సీబీఐ నమోదు చేసింది.

Texas woman arrest : జడ్జీనే చంపేస్తానని బెదిరించిన టెక్సాస్ మహిళ అరెస్ట్

మే 4వతేదీన ఓ గుంపు మహిళల దుస్తులు విప్పి ప్రదర్శన జరిపిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది. మణిపుర్ హింసాకాండకు సంబంధించి మరో 9 కేసులను దర్యాప్తు చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. దీంతో ఆ ఏజెన్సీ విచారించే మొత్తం కేసుల సంఖ్య 17కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. చురచంద్‌పూర్ జిల్లాలో జరిగిన లైంగిక వేధింపుల కేసును దర్యాప్తు సంస్థ స్వీకరించే అవకాశం ఉంది.