29 వేల లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగేశాయట..!

Rats drink 29,000 liters of alcohol ..! : సాధారణంగా కథలు రచయితలు రాస్తారు. వాటిని కొంతమంది స్టోరీలుగా చెబుతారు. కానీ హరియాణా పోలీసులు మాత్రం చక్కటి కథలు చెబుతున్నారు. ఈ కథ ఏంటీ అంటే..‘‘ఎలుకలు ఏకంగా 29,000 లీటర్ల మద్యాన్ని తాగేశాయి’ అని కథలు చెబుతున్నారు. ఏంటీ పోలీసులు ‘స్టోరీ టెల్లర్స్’ ఎప్పుడయ్యారు? వాళ్లు ఇటువంటి జాబులు కూడా చేస్తున్నారా? అని షాక్ అవుతున్నారా? అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసుల దాన్ని పోలీస్ స్టేషన్ లో భద్రపరిచారు. అలా భద్రపరిచిన 29,000 లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగేశాయని కథలు చెబుతున్నారు హరియాణా పోలీసులు..
అసలు జరిగిన విషయం ఏమిటంటే.. హరియాణా పోలీసులు అక్రమ మద్యాన్ని భారీగా స్వాధీనం చేసుకున్నారు. అలా స్వాధీనం చేసుకున్న మద్యాన్ని 30 పోలీస్ స్టేష్టన్లో నిల్వ చేశారు. 50 వేల లీటర్ల నాటు సారా, 30 వేల లీటర్ల మద్యం, 3 వేల క్యాన్ల బీర్‌ను జప్తు చేశారు. ఆ క్రమంలో వారు 825 కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. అయితే నిల్వ చేసిన మద్యం బాటిళ్లలో సుమారు 29 వేల లీటర్ల మద్యం మిస్సైయ్యింది.
ఆ ఆల్కహాల్ అంతా ఏమైందని విచారణ సమయంలో కోర్టులో జడ్జీ అడిగిన ప్రశ్నకు పోలీసులు సమాధానమిస్తూ..‘ఆ మద్యాన్ని ఎలుకలు తాగేసినట్టున్నాయని‘‘ తాపీగా సమాధానం చెప్పారు. ఏంటి ఎలకలు తాగాయా? అంటూ న్యాయమూర్తితో పాటు అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏ బాటిల్‌లోనూ చుక్క కూడా మందు మిగల్చలేదు. లక్కీ డ్రాప్‌తో సహా మొత్తం తాగేశాయట ఎలుకలు. హర్యానాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
ఈ విచిత్ర కేసు వివరాల్లోకి వెళ్తే.. హర్యానా పోలీసులు కొద్ది నెలల క్రితం షాపులపై దాడులు చేసి దాదాపు 50 వేల లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో వివిధ లోకల్ బ్రాండ్స్‌తో పాటు ఫారెన్ మందు బాటిళ్లు కూడా ఉన్నాయి. ఆ ఆల్కాహాల్ బాటిల్స్ అన్నింటిని 30 పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీటికి సంబంధించి 825 మందిపై కేసులు కూడా నమోదు చేశారు. న్యాయస్థానంలో కేసు విచారణ ప్రారంభమైంది. కేసు నడుస్తుండగా.. 25 పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లలో మందు మాయమైనట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యంలో లోకల్ సారా కూడా ఉంది. పెద్ద, పెద్ద డ్రమ్ముల్లో ఆ సారా నిల్వ చేశారు. ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే.. ఎలుకలు లోకల్ సారా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బ్రాండెడ్ మద్యాన్ని చుక్క మిగల్చకుండా తాగేశాయి. మరి ఇప్పుడేం చేయాలి? మద్యం తాగేసిన ఎలుకను పట్టుకుని అరెస్ట్ చేసి సెల్ లో వేసి..అక్రమ మద్యాన్ని తాగేశాయి కాబట్టి అవి నేరం చేసినట్లుగా రుజువు చెయ్యాలి. అంతే కదా అంటూ నెట్టిజన్లు సెటైర్లు వేస్తున్నారు పోలీసుల మీద. మరి జాగ్రత్తండయ్.. మీ ఇంట్లో మందు బాటిల్స్ స్టాకు పెట్టుకుంటే వాటిని మీ ఇంట్లో ఉండే ఎలుకల తాగేస్తాయేమో..టేక్ కేర్..లేకపోతే చుక్క మిగల్చకుండా తాగేస్తాయి…!!
ఇటీవల కాలంలో హరియాణా పోలీసులు.. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెయిడ్లు జరిపి అక్రమంగా నిలువ చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 50 వేల లీటర్ల నాటు సారా, 30 వేల లీటర్ల మద్యం, 3 వేల క్యాన్ల బీర్‌ను జప్తు చేశారు. ఆ క్రమంలో వారు 825 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో కోర్టు విచారణ జరుగుతుండటంతో ఈ మద్యాన్ని వారు పోలీస్ స్టేషన్లలోని స్టోర్ రూమ్స్‌లో భద్రపరిచారు. ఇటీవల కోర్టు తీర్పు వెలువడటంతో ఆ మద్యాన్ని పారేశేందుకు వారు నిర్ణయించారు. ఈ క్రమంలో నిల్వ ఉంచిన మద్యంలో దాదాపు 29 వేల లీటర్లు కనిపించకుండా పోయినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. మరి ఆ మద్యం అంతా ఏమైపోయిందని పోలీసులను ప్రశ్నించగా.. ఎలుకలు తాగేశాయని వారు చెప్పుకొచ్చారట. దీంతో.. ఈ విషయంలో నిజానిజాలు తేల్చేందుకు ప్రస్తుతం అక్కడ దర్యాప్తు ప్రారంభమైంది.