Rahul Gandhi : త్వరలో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ!

నూతన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు త్వరలోనే ఉపసంహరణ కానున్నాయని శుక్రవారం రాహుల్

Rahul Gandhi : త్వరలో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ!

Ra

Updated On : October 29, 2021 / 5:24 PM IST

Rahul Gandhi నూతన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు త్వరలోనే ఉపసంహరణ కానున్నాయని శుక్రవారం రాహుల్ ఓ ట్వీట్ లో తెలిపారు.

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేపడుతున్న ఢిల్లీ సరిహద్దుల్లో(గాజిపుర్​,టిక్రీ) ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢిల్లీ పోలీసులు తొలగిస్తున్న క్రమంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆర్టిఫిషియల్ బారికేడ్లను మాత్రమే ఇప్పటివరకు తొలగించారని..త్వరలోనే మూడు రైతు వ్యతిరేక చట్టాల ఉపసంహరణ ఖాయమని.. అన్నదాతల సత్యాగ్రహం భేష్ అంటూ ఫార్మర్స్ ప్రొటెస్ట్ హ్యాష్ ట్యాగ్ తో చేసిన ట్వీట్ లో రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

కాగా,రైతుల ఆందోళన కారణంగా ఏడాదిగా మూతపడిన ఢిల్లీ- ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దును అధికారులు శుక్రవారం తెరిచారు. జాతీయ రహదారి 9లోని సెక్టార్​ 2, 3 వద్ద ఉన్న బారికేడ్లను తొలగించారు అధికారులు.త్వరలోనే జాతీయ రహదారి 9పై రాకపోకలు ప్రారంభమవుతాయని డీసీపీ ప్రియాంక కశ్యప్ తెలిపారు. ఇక,నేషనల్ హైవే 24ను ఇప్పటికే రాకపోకల కోసం ఓపెన్ చేసినట్లు చెప్పారు.

ALSO READ Rakesh Tikait : టిక్రీ,ఘాజిపూర్ సరిహద్దుల్లో బారికేడ్ల తొలగింపు..పార్లమెంట్ కి రైతులు