కనువిందు : ‘సూపర్ మామ్’ కు 30 పిల్లలు

  • Published By: veegamteam ,Published On : January 28, 2019 / 07:11 AM IST
కనువిందు : ‘సూపర్ మామ్’ కు 30 పిల్లలు

Updated On : January 28, 2019 / 7:11 AM IST

భోపాల్: పెద్దపులులు అంతరించిపోతున్నాయని అటవీశాఖ అధికారులు పులుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోనే పెంచ్ నేషనల్ పార్క్ లో ఓ పెద్దపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో అటు జూ అధికారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. 

మధ్యప్రదేశ్‌లోని పెంచ్ నేషనల్ పార్క్‌లో పులి తనకు జన్మించిన నాలుగు కూనలతో పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ‘సూపర్ మామ్’ పేరుతో గుర్తింపు పొందిన ఈ పులి గతంలో ఏడుసార్లు తల్లి అయి 26 కూనలకు జన్మనిచ్చింది. 8వసారి నాలుగు కూనలకు జన్మనిచ్చి మొత్తంగా 30 కూనలకు తల్లిగా మారింది. కొత్తగా పుట్టిన పులికూనలు బుజ్జి బుజ్జిగా తిరిగేస్తు పర్యాటకులను అలరిస్తున్నాయి. సూపర్ మామ్ కు జన్మించిన పులి కూనలు పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నాయని పెంచ్ నేషనల్ పార్క్ అధికారి విక్రమ్‌సింగ్ తెలిపారు. కాగా వైల్డ్ లైప్ ఫొటోగ్రాఫర్లు ఈ పులులకు ఫొటోలు తీశారు. పెంచ్ నేషనల్ పార్క్ అధికారుల వద్ద నున్న సమాచారం ప్రకారం ‘సూపర్ మామ్’ పులి 2005లో జన్మించింది. పులులు గర్భం ధరించిన 16 వారాలకు (నాలుగు నెలలు) పిల్లల్ని కంటాయి. ఈ క్రమంలో నవంబర్  నెలలు గర్భం ధరించిన సూపర్ మామ్ జనవరిలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.