Viral Video: ఆసుపత్రి క్యాంపస్‌లో వైద్య విద్యార్థులు ఖతర్నాక్ డ్యాన్స్.. ఆపై 38 మంది సస్పెన్షన్

ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఆసుపత్రిలో అసిస్టెంట్ డాక్టర్స్‌గా..

Viral Video: ఆసుపత్రి క్యాంపస్‌లో వైద్య విద్యార్థులు ఖతర్నాక్ డ్యాన్స్.. ఆపై 38 మంది సస్పెన్షన్

కన్నడ, బాలీవుడ్ పాటలకు రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు GIMSలోని కొందరు మెడికల్ విద్యార్థులు. అవి వైరల్ కావడంతో ఫైనల్ ఇయర్ చదువుతున్న మెడికల్ స్టూడెంట్స్ పై సస్పెన్షన్ వేటు పడింది. త్వరలో జరగబోయే గ్రాడ్యుయేషన్‌ డే సెలెబ్రేషన్స్ కోసం రీల్స్ చేసినట్లు విద్యార్థులు తెలిపారు.

ఫిబ్రవరి 10వ తేదీ శనివారం రోజున ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ బసవరాజ బొమ్మనహళ్లి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం GIMS డైరెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆసుపత్రి క్యాంపస్‌లో ఇలాంటి రీల్స్ చేయడానికి అనుమతి లేదన్నారు.

రోగులకు అసౌకర్యం కలిగించే విధంగా విద్యార్థులు ప్రవర్తించడం సరికాదన్నారు. 38 మంది విద్యార్థుల్లో చాలా మంది ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఆసుపత్రిలో అసిస్టెంట్ డాక్టర్స్ గా కొనసాగుతున్నారు. ఈ సస్పెన్షన్ 10 రోజుల వరకు కొనసాగుతుంది.

అంతకుముందు, కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్‌ థియేటర్‌లో ఒక డాక్టర్‌ తనకు కాబోయే భార్యతో కలిసి ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ నిర్వహించినందుకు ప్రభుత్వం ఆ డాక్టర్‌ను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

‘నేను డెలివరీ చేయను.. ఏం చేసుకుంటావో చేసుకో’ అని మహిళకు దురుసుగా సమాధానమిచ్చిన స్విగ్గీ డెలివరీ బాయ్