Earthquake : అండమాన్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదు
Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. సోమవారం (మే 9, 2022) తెల్లవారుజామున 1.11 గంటల సమయంలో క్యాంప్‌బెల్ బే వద్ద ఒక్కసారిగా భూమి కంపించింది.

4.4 Magnitude Earthquake Hits Andaman And Nicobar's Campbell Bay
Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. సోమవారం (మే 9, 2022) తెల్లవారుజామున 1.11 గంటల సమయంలో క్యాంప్‌బెల్ బే వద్ద ఒక్కసారిగా భూమి కంపించింది. భూప్రకంపనల తీవ్రత.. రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ఒక ప్రకటనలో వెల్లడించింది. భూకంపకేంద్రం క్యాంప్‌బెల్ తీరానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.
అండమాన్ దీవుల్లో పది రోజుల వ్యవధిలో భూకంపం రావడం రెండోసారి. ఏప్రిల్ 30న డిగ్లిపూర్‌లో 11.04 గంటలకు భూకంపం సంభవించినట్టు ఎన్‌సీఎస్ వెల్లడించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని వెల్లడించింది. ఇటీవలే ఇదే ప్రాంతంలో భూకంపం వచ్చింది. క్యాంప్‌బెల్ బేకు ఈశాన్యంలో 70 కిలోమీటర్ల దూరంలో భూమి ఒక్కసారిగా కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) అధికారులు పేర్కొన్నారు.

4.4 Magnitude Earthquake Hits Andaman And Nicobar’s Campbell Bay
గుజరాత్ గిర్ సోమనాథ్ జిల్లాలో రెండుసార్లు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై మొదటిసారి 4.0, రెండోసారి 3.2గా నమోదైంది. ఈ మేరకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (ISR) ఒక ప్రకటనలో వెల్లడించింది. 4.0 తీవ్రతతో భూకంపం ఉదయం 6.58 గంటలకు సంభవించినట్టు తెలిపింది. ఉత్తర-ఈశాన్యంగా 13కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
An earthquake of magnitude 4.4 occurred at around 1:11am, 85km NNE of Campbell Bay, Andaman and Nicobar island today: National Center for Seismology
— ANI (@ANI) May 8, 2022
రెండో భూకంపం రిక్టర్ స్కేల్‌పై 3.2తో ఉదయం 7.04 గంటలకు సంభవించింది. తలాలా గ్రామానికి ఉత్తర-ఈశాన్యంగా 9 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. రెండు చోట్ల వచ్చిన భూకంపంలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి వివరాలు లేవు.
Read Also : EarthQuake in Japan: జపాన్‌లో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు